సింగపూర్ లో సీబీఎన్.. వరుస భేటీలు.. పలు కంపెనీలతో ఎంవోయూలు

Publish Date:Jul 30, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటన ముగిసింది. ఆ ఏపీకి బయలుదేరారు. నాలుగు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా ఆయన మొత్తం 26 సమావేశాలలో పాల్గొన్నారు. చంద్రబాబు పర్యటన  ముగిసి, ఆయన ఏపీకి బయలుదేరి వెడుతున్న సందర్భంగా  ఆయన బస చేసిన హోటల్ వద్దకు పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు చేరుకుని ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.  ఈ సందర్భంగా సింగపూర్ లోని తెలుగు ప్రజల అభిమానానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడి తెలుగు ప్రజ తన పట్ల చూపిన అభిమానాలు, ఆత్మీయ స్వాగతం, ప్రేమాభిమానాలూ మరువలేనివని చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్ నుంచి చంద్రబాబు బుధవారం (జులై 30) రాత్రి పదిన్నరకు శంషాబాద్ చేరుకుని, అక్కడ నుంచి బెజవాడకు బయలుదేరి రాత్రి పదకొండున్నరకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. 

చంద్రబాబు సింగపూర్ పర్యటన యావత్తూ ఆయన విజనరీకి తగినట్లుగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల రాక లక్ష్యంగా సాగింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిథుల నుంచి ఆయన ప్రజంటేషన్ కు, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన తీరుకు ముగ్ధులయ్యారు. ఈ పర్యటనలో పలు సంస్థలు ఏపీలో కార్యకలాపాలు సాగించేందుకు అంగీకరిస్తూ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సింగపూర్ సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి టాన్‌ సీ లాంగ్ అయితే చంద్రబాబు పనితీరు, దార్శనికతపై పొగడ్తల వర్షం కురిపించారు.  నిరంతరం ప్రజలతో మమేకం కావడం, వారి సమస్యల పరిష్కారం విషయంలో శ్రద్ధ తీసుకోవడం,

అదే సమయంలో రాష్ట్రప్రగతి, పురోగతి కోసం ప్రణాళికలు రూపొందించి, వాటిని  అత్యంత కచ్చిత్వంతో అమలు చేయడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమౌతుందని ప్రశంసించారు. చంద్రబాబుతో కలిసి పని చేయడానికి తాము ఉత్సు కతతో ఉన్నామంటూ..  గృహనిర్మాణం, సముద్రంలో కేబుల్ నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులపై కలిసి పని చేయడానికి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెళ్లడించారు. అంతే కాకుండా  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైద‌రాబాద్‌లో చేప‌ట్టిన ప్రాజెక్టులు ఇప్ప‌టికీ అంతే నాణ్య‌త‌తో కొన‌సాగుతుండటానికి కారణం చంద్రబాబు దార్శనికతేనని చెప్పారు. 

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది.
ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని, అలాగే ఏపీబీసీఎల్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి అరెస్టుతో ఈ కుంభకోణం తాలూకు మూలాలు ఎక్కడికి దారితీస్తున్నాయి, అంతిమంగా దీని ప్రభావం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పడబోతోందా అనే విషయంపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విశ్లేషించారు.
ఈ మొత్తం స్థలం విలువ బహిరంగ మార్కెట్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఇందులో సింహభాగం అంతా ప్రభుత్వానికి చెందిన భూమి కావడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ మాట్లాడారు.
సహజంగా దేశ చరిత్రలో జవహర్‌లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు, ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రులుగా సేవలందించారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన రికార్డు ఎలా ? అన్న విషయాన్నితెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ ఎనలిస్టు వివరించారు.
గత సార్వత్రిక ఎన్నికల ముందే వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమై కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముగిసిన తర్వాత నాని వైసీపీకి దూరంగా జరుగుతూ మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తమ్ముడు కేశినేని చిన్నితో వైరం మాత్రం పెరుగుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వైసిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనల్లో భాగంగా ఒక ధర్నాలో పాల్గొన్న అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నిరసనల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సమాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.