ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఎన్డీయే అభ్యర్థికి జగన్ మద్దతుపై చంద్రబాబు ఏమన్నారంటే?

Publish Date:Aug 23, 2025

Advertisement

ఉపరాష్ట్రపతి ఎన్నిక జాతీయ రాజకీయాల్లో ఊహించని  సమీకరణాలకు, అనూహ్య పరిణామాలకూ తావిచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎన్డీయే కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై పలు రకాల విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. ఏపీసీసీ చీఫ్, జగన్ తొడబుట్టిన సోదరి షర్మిల సహా పలువురు జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. రాజకీయంగా ఓ సిద్ధాంతమంటూ  లేని పార్టీగా వైసీపీని అభివర్ణిస్తున్నారు. పార్టీ అధినేత స్వప్రయోజనాల పరిరక్షణ వినా వైసీపీకి మరో సిద్ధాంతం లేదన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.

జగన్ సోదరి షర్మిల అయితే ఒక అడుగు ముందుకు వేసి జగన్ ను ప్రధాని మోడీ దత్తపుత్రుడిగా పేర్కొన్నారు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం పవన్ కల్యాణ్ ను దత్తపుత్రుడు అంటూ విమర్శలు గుప్పించేవారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జగన్ ను ఆయన సోదరి షర్మిల మోడీ దత్తపుత్రులు అంటూ విమర్శలు గుప్పించారు. రహస్య ఒప్పందాలు, సీక్రెట్ డీల్సే జగన్ రాజకీయం అని దుమ్మెత్తి పోశారు. 

ఆ విమర్శలు, వ్యాఖ్యలు పక్కన పెడితే.. తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. తన వ్యాఖ్యలతో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. హస్తిన పర్యటనలో భాగంగా  మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పై సునిశిత విమర్శలు చేశారు. నేరుగా జగన్ ను విమర్శించకుండానే ఆయన సిద్ధాంత రాహిత్యాన్నీ, అవకాశవాద రాజకీయాన్నీ ఎండగట్టారు.

మీడియా సమావేశంలో ఓ విలేకరి వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వడంపై  అడిగిన ప్రశ్నకు చంద్రబాబు.. ఆ విషయం తనను కాదు జగన్ ను అడగాలని బదులిస్తూనే.. తెలుగుదేశం ఎన్డీయేలో కీలక భాగస్వామి. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే కూటమి ఏకగ్రీవంగా రాథాకృష్ణన్ ను ఎంపిక చేసింది. అందుకే మరో మాటకు అవకాశం లేకుండా తమ పార్టీ ఆయనకు మద్దతు ప్రకటించిందని స్పష్టం చేశారు.  ఈ ఒక్క మాటతో చంద్రబాబు జగన్ పార్టీ మద్దతు రాజకీయపరమైనది కాదని ఎండగట్టేశారు.

అదే సమయంలో జగన్ రాధాకృష్ణన్ కు మద్దతు ప్రకటించడం పూర్తిగా వ్యక్తిగత అజెండా అనీ, అవకాశవాదమనీ చెప్పకనే చెప్పేశారు.  జగన్ నిర్ణయం గురించి తాను మాట్లాడనని చెబుతూనే.. తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కీలక భాగస్వామి అని, ఆ కూటమితో జగన్ కు కానీ వైసీపీకి కానీ ఎలాంటి సంబంధం లేదనీ చెప్పకనే చెప్పేశారు. తద్వారా జగన్ మద్దతు వెనుక ఆయన స్వార్థ ప్రయోజనం వినా మరో కారణం లేదని పరోక్షంగా తేల్చేశారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.