చంద్రబాబుకు జస్ట్ 5 నిముషాలు చాలు
Publish Date:Jul 24, 2025
Advertisement
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికీ, పరిశ్రమలను ఏర్పాటు చేసేలా పారిశ్రామిక వేత్తలను కన్విన్స్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జస్ట్ ఐదంటే ఐదు నిముషాలు చాలు. ఈ విషయం గతంలో పలుమార్లు రుజువైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్ గా బెంగళూరు, చెన్నైలకు దీటుగా మార్చడంలో ఆయన పాత్ర కీలకం. ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు కేవలం ఆయనపైనా, అభివృద్ధి విషయంలో ఆయనకు ఉన్న విజన్ పైనా నమ్మకంతో హైదరాబాద్ కు తరలి వచ్చాయి. ఇప్పుడు అదే పరిస్థితి అమరావతిలో కనిపిస్తున్నది. ఐదేళ్ల జగన్ పాలన ఏపీలో పరిశ్రమల రంగానికి ఒక చీకటి అధ్యాయం అని చెప్పవచ్చు. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రప్రజలకు నరకం చూపించారు. ఆయన పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. అన్ని వర్గాల ప్రజలూ ఆయన పీడిత పాలన బాధితులే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అంతకు ముందు చంద్రబాబు పాలనలో అంటే 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పలు పరిశ్రమలను జగన్ తన విధానాలతో రాష్ట్రం నుంచి తరిమేశారు. దీంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు సంగతి అలా ఉంచి.. ఉన్న పరిశ్రమలే తరలిపోయే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఐదేళ్ల జగన్ పాలనకు చరమగీతం పాడుతూ 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. దీంతో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే రాష్ట్ర పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలన్నీ తమ కార్యకలాపాలను ఏపీలో కూడా ప్రారంభించేందుకు క్యూకడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వరద వచ్చిందంటే.. అది సీబీఎన్ పై ఉన్న నమ్మకమే కారణం అనడంలో సందేహం లేదు. చంద్రబాబు పట్ల ఇన్వెస్టర్లలో నమ్మకానికి విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఈవెంట్ సాక్షిగా యూఏఈ మంత్రి చెప్పిన మాటలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. ఈ ఈవెంట్ కు గల్ఫ్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఈ సదస్సుకు హాజరైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రీ దావోస్ లో చంద్రబాబుతో ఐదు నిముషాలు భేటీ అయ్యాననీ, ఆ సందర్భంగా ఆయన విజన్ పట్ల ఆకర్షితుడినై పెట్టుబడితో ఏపీకి వచ్చేశామని చెప్పారు. ఇది చాలదూ రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న విజన్ కు, చిత్తశుద్ధికీ. యూఏఈ తన ఆర్థిక వ్యూహాల్లో భాగంగా పర్యాటకం, సాంకేతికత, ఇతర రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.
http://www.teluguone.com/news/content/cbn-need-just-five-miniutes-to-attract-investments-39-202642.html





