ఫైబర్ నెట్ సమూల ప్రక్షాళనపై బాబు దృష్టి.. జీవీరెడ్డే రైట్!

Publish Date:Jul 16, 2025

Advertisement

జగన్ హయాంలో  ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లొ  పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం, అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్తలను పెద్ద సంఖ్యలో ఫైబర్ నెట్ లో  నియమించి వేతనాలు చెల్లించడమే కాకుండా, ఫైబర్ నెట్ ను వైసీపీ కార్యకర్తలు, నాయకులకు రాజకీయ ఆశ్రయ కేంద్రంగా మార్చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫైబర్ నెట్ ద్వారా జగన్ సొంత మీడియా ఉద్యోగులకు సైతం వేతనాలు వెళ్లాయన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా సైబర్ నెట్ ను అడ్డు పెట్టుకుని రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయలు గండి కొట్టారని అప్పట్లో తెలుగుదేశం, జనసేనలు ఆరోపించాయి. సరే ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అద్భుత విజయం సాధించి అధికార పగ్గాలు చేసట్టింది.  కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సైబర్ నెట్ ప్రక్షాళనే ధ్యేయంగా చంద్రబాబు తెలుగుదేశం అధికార ప్రతినిథి జీవీ రెడ్డిని చైర్మన్ గా నియమించారు. విద్యావంతుడు, న్యాయవాది అయిన జీవీ రెడ్డి ఫైబర్ నెట్ కమిషనర్ గా బాధ్యతలు చేపడుతూనే ప్రక్షాళక చర్యలకు ఉపక్రమించారు. 

అయితే.. ఫైబర్ నెట్ లో సీనియర్ ఐఏఎస్ అధికారి జీవీరెడ్డి ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిగా వ్యవహరించడంతో  జీవీరెడ్డి నేరుగా సీఎం చంద్రబాబుకు విషయాన్ని వివరిస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం ఒకింత సంయమనంతో వ్యవహరించాలని సూచించడంతో సహనం కోల్పోయిన తన పదవికి రాజీనామా చేసి వైదొలిగారు. తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేసి రాజకీయాల నుంచే వైదొలిగారు.  

అయితే ఇటీవల సీఎం చంద్రబాబు ఫైబర్ నెట్ పై నిర్వహించిన సమీక్షలో నాడు జీవీరెడ్డి చెప్పిన విషయాలన్నీ అక్షరసత్యాలన్న విషయం వెలుగులోకి వచ్చింది.  గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ కేవలం  130 మంది సిబ్బందితో  చాలా ఎఫెక్టివ్ గా పని చేసింది. అదే వైసీపీ హయాంలో ఉద్యోగుల సంఖ్య పది రెట్లకు పైగా పెరిగింది.  ఈ పెరిగిన నియామకాల్లో అత్యధికులు వైసీపీ విధేయులే ఉన్నారన్న విషయం కూడా చంద్రబాబు సమీక్షలో వెలుగు చూసింది.  అంత భారీగా సిబ్బంది పెరిగినా వైసీపీ హయాంలో ఫైబర్ నేట్ సాధించింది శూన్యం. పైగా ఆ శాఖ పని తీరు తిరోగమనం దిశగా సాగింది. అంతకు ముందు వైసీపీ హయాంలో  ఫైబర్ నెట్ యాక్టివ్ కనెక్షన్ల సంఖ్య ఎనిమిది లక్షలు ఉంటే.. జగన్ హయాంలో ఇది నాలుగు లక్షలకు అంటే సగానికి పడిపోయింది.  

వాస్తవానికి జీవీరెడ్డి  ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్న స్వల్పకాలంలో గుర్తించి సరి చేయడానికి ప్రయ త్నించిన విషయం కూడా ఇదే. ఆయన అదనపు సిబ్బందిని, కార్యాలయానికి రాకుండా పేస్కేళ్లలో ఉన్న వారిని తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. ఫలితం లేకపోయింది. ఇప్పడు ఇదే విషయం చంద్రబాబు సమీక్షలో వెలుగు చూసింది. దీంతో ఆయన ఇప్పుడు ఫైబర్ నెట్ ప్రక్షాళనకు సీరియస్ గా నడుంబిగించారని తెలుస్తోంది. ఫైబర్ నెట్ సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  

By
en-us Political News

  
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.