బాబు హస్తిన టూర్.. వైసీపీలో భయం..జగన్ అరెస్టేనా?

Publish Date:May 21, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో నేడో రేపో అరెస్టు కానున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ విశ్లేషకులు ఔననే అంటున్నారు. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిని విడివిడిగా, కలిసి విచారించిన సిట్.. కీలక ఆధారాలు సేకరించిందని అంటున్నారు. వాటి ఆధారంగా ఈ కేసులో అంతిమ లబ్ధిదారు జగన్ అన్న నిర్ధారణకు వచ్చిన సిట్ అధికారులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.

ముఖ్యంగా  ఈ కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారడానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఆయన న్యాయవాది కోర్టులోనే ఈ కేసులో పెద్దలు తప్పించుకుని తన క్లయింట్ రాజ్ కేశిరడ్డిని బలిపశువులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు రాజ్ కేసిరెడ్డి బ్రేక్ డౌన్ అయ్యి మద్యం కుంభకోణం కేసు సూత్రధారులు, వాస్తవ లబ్ధిదారుల వివరాలు వెల్లడించేసి ఉండొచ్చని కూడా అంటున్నారు. అలాగే ఇదే కేసులో అరెస్టైన జగన్ కు అత్యంత సన్నిహితులైన గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల ద్వారా కూడా కీలక సమాచారం రాబట్టిన సిట్.. ఇక జగన్ అరెస్టు దిశగా అడుగులు వేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అన్నిటికీ మించి వైసీపీ నాయకులు, శ్రేణులే జగన్ అరెస్టు తధ్యమన్న భావనలో ఉన్నారంటున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని వంటివారు బాహాటంగానే జగన్ అరెస్టవుతారంటూ మీడియా ముఖంగానే చెప్పేశారు. అదలా ఉంచితే.. జగన్ అరెస్టు విషయంలో ఇప్పటికే గవర్నర్ కు సమాచారం అందించినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో గవర్నర్ కంటే కేంద్రం ఆమోదం ఉంటే బెటరన్న ఉద్దేశంతో తెలుగుదేశం కూటమి ఉన్నట్లు చెబుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లుగా ఇంత వరకూ తెలుగుదేశం కూటమి దర్యాప్తు కు సంబంధించినంత వరకూ ఎలాంటి జోక్యం  చేసుకోలేదు. అలాగే ఇప్పటి వరకూ అరెస్టులపై పెద్దగా స్పందించినదీ లేదు. అయితే సిట్ దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాలు జగన్ అరెస్టు వరకూ దారి తీసిన నేపథ్యంలో..ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలంటే సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవలఃసి ఉంటుంది. మామూలుగా జగన్ సీఎం కాకముందే ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో అరెస్టుకు సెక్షన్ 17ఏ వర్తించదు కానీ, మద్యం కుంభకోణం కేసులో అరెస్టునకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గవర్నర్ కు విషయం తెలియజేయడం జరిగిందనీ, అయితే గవర్నర్ నిర్ణయం తీసుకోవడంలో ముందు వెనుకలాడుతున్నారనీ, దీంతో విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందంటున్నారు. 

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మూడు రోజుల ఢిల్లీ పర్యటన కేవలం సాధారణ రాజకీయ పర్యటనగా భావించజాలమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గురువారం (మే 22) చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఆ మరునాడు అంటే శుక్రవారం (మే 23) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇది సాధారణ భేటీ కాదనీ, ఒక ఉన్నత స్థాయి మీటంగ్ అనీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏపీలో జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై చర్చించడానికేనని కూడా అంటున్నారు. ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకూ అరెస్టైన కీలక వ్యక్తుల విచారణలో ఈ స్కాంలో అంతిమ లబ్ధిదారు జగనే అని సిట్ నిర్దారణకు వచ్చిన నేపథ్యంలో జగన్ ను అరెస్టునకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందేందుకే చంద్రబాబు హస్తిన పర్యటన పెట్టుకున్నారని అంటున్నారు. 
మామూలుగా శనివారం (మే24) హస్తినలో జరిగే నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొనేందుకే చంద్రబాబు హస్తిన పర్యటన అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ ఆ సమావేశంలో పాల్గొనేందుకే అయితే చంద్రబాబు గురువారమే (మే22) హస్తినకు బయలు దేరాల్సిన అవసరం లేదు. అందుకే చంద్రబాబు హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరో వైపు చంద్రబాబు హస్తిన పర్యటనతో వైసీపీలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే జగన్  గురువారం (మే 22) మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.  మొత్తం మీద చంద్రబాబు హస్తిన పర్యటనకు జగన్ అరెస్టునకు ముడిపెడుతూ రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. 

By
en-us Political News

  
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
ప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.