దావోస్ లో ముగిసిన బాబు పర్యటన.. విజయవంతంగా బ్రాండ్ ఏపీ ప్రమోషన్

Publish Date:Jan 23, 2025

Advertisement

ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నాలుగు రోజులు పాటు దావోస్ లో బిజీబిజీగా గడిపిన చంద్రబాబు పర్యటన ముగిసింది. గురువారం (జనవరి 23) సాయంత్రం ఆయన దావోస్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా సాగిన చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం అయ్యింది.  ఈ నాలుగు రోజులూ ఆయన   ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈవోలు-అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో  భేటీలు జరుపుతూనే.. మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో  పాల్గొని ఆంధ్రప్రదేశ్‌  బ్రాండ్ ను ప్రమోట్ చేశారు. 

దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు బృందం దావోస్ నుంచి జ్యూరిచ్ కు రోడ్డు మార్గంలో  చేరుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. అయితే మంత్రి నారా లోకేష్ మాత్రం మరో రోజు అదనంగా దావోస్ లో గడుపుతారు. మరి కొందరు పారిశ్రామిక వేత్తలతో ఆయన భేటీ కానున్నారు.  

  జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో స్విట్జర్లాండ్‌లోని భారత అంబాసిడర్‌ మృధుల్ కుమార్‌తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించడంతో తొలి రోజు పర్యటనను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఫార్మాస్యుటికల్స్, మెడికల్ డివైజ్‌లు, టెక్నికల్ టెక్స్‌టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని వారికి వివరించారు.  
ఇక రెండో రోజు రెండో రోజు   భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్రత్యేక సెషన్‌లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై ప్రసంగించిన చంద్రబాబు ప్రసంగించారు.   2047 విజన్ రోడ్‌మ్యాప్‌లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పది మార్గదర్శక సూత్రాలను  వివరించారు. భవిష్యత్ నాయకులను సిద్ధం చేయడానికి అమరావతిలో ఏర్పాటు చేయనున్న  గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్  జీఎల్సీ ఉపయోగ పడుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు గ్లోబల్ హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నట్టు వివరించారు.  

ఇక మూడో రోజు   గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తో భేటీ అయ్యారు.  ఆ సంస్థ  విశాఖలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు.  గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్‌ అనుసంధానించేలా తయారీ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పాలని థామస్ కురియన్‌కు చంద్రబాబు  సూచించారు. అలాగే  చమురు, సహజవాయువు కంపెనీ పెట్రోనాస్ ప్రెసిడెంట్, సీఈవో  ముహమ్మద్ తౌఫిక్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు.    గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పెట్రోనాస్ కాకినాడ ప్లాంటులో రూ. 13,000 కోట్ల నుంచి రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం తెలిపింది.  పెట్రోకెమికల్ హబ్‌గా అవతరిస్తున్న మూలపేటలోనూ, అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లోనూ భాగస్వామి కావాలని ముహమ్మద్ తౌఫిక్‌ను చంద్రబాబు కోరారు.  ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫుడ్ బెవరేజెస్‌గా ఉన్న పెప్సీకో ఇంటర్నేషనల్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో నూ చంద్రబాబు భేటీ అయ్యారు.   విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్‌గా చేసుకుని పెప్సీకో డిజిటల్ హబ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అదే రోజు బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ప్రతినిధి హమద్ అల్ మహ్మీద్, ముంతాలకత్ సీఈవో అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. వారికి రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానంపై వివరించారు. 

 ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల హబ్ గా ఏపీని  మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ ఫౌండర్‌ బిల్ గేట్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని, అలాగే ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో సూచనలు చేయాలని కోరారు. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ విజయవంతంగా అమలు చేస్తున్న హెల్త్ డ్యాష్‌బోర్డ్‌లు, సామాజిక కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా నిర్వహించాలని చంద్రబాబు ఆయనను కోరారు. అలాగే హిందూస్థాన్ యూనిలీవర్  చీఫ్ సప్లై చైన్ అధికారి విల్లెం ఉజ్జెన్ తో భేటీలో  విశాఖలో ఆ సంస్థ 330 కోట్ల రూపాయల పెట్టుబడితో  యూనిలీవర్‌ను బ్యూటీ పోర్ట్‌ఫోలియో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు అంగీకరింపచేశారు. రాష్ట్రంలో పెద్దఎత్తున వచ్చే వ్యవసాయ దిగుబడులను హిందుస్థాన్ యూనిలీవర్ వినయోగిం చుకోవచ్చని, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యూటీ, హోమ్ కేర్ ఉత్పత్తుల తయారీకి రాష్ట్రం అనుకూలంగా ఉంటుందనీ వివరించారు. ఇంకా  సెన్మట్ హెడ్ రాబర్టో బోకాతో భేటీలో  గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తరలివచ్చేలా  సహకారం అందించాలని కోరారు.  స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు డబ్ల్యూఈఎఫ్ మద్దతివ్వాలని అభ్యర్ధించారు.   అలాగే  ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకురావాలని ప్రపంచంలో కంటైనర్ టెర్మినల్‌లో ప్రతిష్ఠాత్మక సంస్థ డీపీ వరల్డ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. 

ఇక చివరి రోజైన గురువారం (జనవరి 23) కూడా చంద్రబాబు వివిధ సంస్థల ప్రతినిథులతో వరుస భేటీలతో బిజీబిజీగా కడిపారు.  ప్రఖ్యాత స్విస్ వ్యవస్థాపకుడు, పర్యావరణవేత్త, చె హోల్డింగ్స్‌ వైస్-ఛైర్మన్ ఆండ్రే హాఫ్‌మన్‌తో భేటీ అయ్యారు. అలాగే యూఎన్‌డీపీ అధిపతి అచిమ్ స్టెయినర్, సీఎన్ఎన్ బెకీ ఆండర్సన్‌తోనూ చర్చించారు. మొత్తం మీద బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడమే లక్ష్యంగా సాగిన ఆయన దావోస్ పర్యటన విజయవంతమైంది. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.