వైసీపీ సోషల్ మీడియా దాటేసింది హద్దులు.. చంద్రబాబు వార్నింగ్ తో మొదలైన వణుకు!

Publish Date:Nov 8, 2024

Advertisement

వైసీపీ సోష‌ల్ మీడియా హ‌ద్దులు దాటింది. ఇత‌ర పార్టీల్లోని మ‌హిళ‌ల‌పై, నేత‌ల కుటుంబాల్లోని ఆడ‌వారిపై అస‌భ్య‌క‌రంగా పోస్టులు పెడుతూ రాక్ష‌స ఆనందం పొందుతున్నారు. ఫ‌లితంగా బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడాలంటే కొంద‌రు మ‌హిళ‌లు భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి. ముఖ్యంగా వైసీపీ   హ‌యాంలో ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను ఎత్తి చూపిన వారిపై   ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్యాఖ్య‌లు చేయ‌డం, వారి ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి మాన‌సికంగా ఇబ్బందుల‌కు గురిచేయ‌డం వంటి చ‌ర్య‌ల‌కు వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్‌ పాల్ప‌డింది. తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు, మ‌హిళా నేత‌లు వైసీపీ సోష‌ల్ మీడియా వెకిలి పోస్టుల‌తో మాన‌సికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిని కట్ట‌డి చేయాల్సిన పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆ మేర‌కు చ‌ర్య‌లు తీసుకోక‌పోగా.. అలాంటి వారికి పార్టీలో పెద్ద‌పీట వేస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణితోపాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి, నారా లోకేశ్ స‌తీమ‌ణి ఇలా అనేక మంది విపక్షాల నేత‌ల కుటుంబ స‌భ్యులు, మ‌హిళా నేత‌ల పై అస‌భ్య‌క‌ర పోస్టింగ్ ల‌తో వైసీపీ సోష‌ల్ మీడియా మూక రెచ్చిపోయింది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ సోష‌ల్ మీడియా వెకిలి పోస్టుల‌కు చెక్ ప‌డుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, వారి ఆగ‌డాలు ఇంకా ఎక్కువ‌య్యాయి. సోష‌ల్ మీడియా సైకోల‌ను జ‌గ‌న్ ఇంకా ప్రోత్స‌హిస్తూ వ‌చ్చారు.  హోం మంత్రి అనిత,  జ‌గ‌న్ సోదరి, కాంగ్రెస్ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌పై వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ పెట్టిన అస‌భ్య‌క‌ర పోస్టుల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ బ్యాచ్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వంలో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయంటూ విష‌ ప్ర‌చారం చేయ‌డం మొద‌లు పెట్టింది. అంత‌టితో ఆగ‌కుండా సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌ల‌పై అస‌భ్య‌  ప‌ద‌జాలంతో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌ పోస్టింగ్‌లు పెడుతున్నారు. వీరి ఆగ‌డాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి.  వారిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ క్ర‌మంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. పిఠాపురం ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీస్ వ్య‌వ‌స్థ ప‌నితీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. హోంమంత్రి అనిత రివ్యూ చేయాల‌ని.. పోలీస్ వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టాల‌ని  సూచించారు. అదేక్ర‌మంలో నేను హోం మంత్రి ప‌ద‌వి తీసుకుంటే ప‌రిస్థితి వేరేలా ఉంటుందంటూ..  ఇప్ప‌టికీ వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్న కొంద‌రు పోలీసు అధికారుల‌కు ప‌వ‌న్‌ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో చంద్ర‌బాబు మాట్లాడారు. అస‌భ్య‌క‌ర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్న‌ వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ ను క‌ట్ట‌డి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఈ క్ర‌మంలో తాజాగా చంద్ర‌బాబు తో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఆ త‌రువాత హోంమంత్రి అనిత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భేటీ అయ్యారు. వీరి భేటీ మ‌ధ్య ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో రెచ్చిపోయే వారిపై, రాజ‌కీయ నాయ‌కులు, వారి కుటుంబ స‌భ్యుల ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి పోస్టులుచేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. 

అమ‌రావ‌తిలో జ‌రిగిన ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ.. వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియాలో హ‌ద్దులుదాటి ప్ర‌వ‌ర్తిస్తే ఇక నుంచి చూస్తూ ఊరుకునేది లేద‌ని, చ‌ట్ట‌ప‌రంగా కఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఆడ‌బిడ్డ‌ల‌పై త‌ప్పుడు పోస్టింగ్ లు పెట్టాలంటే వ‌ణికిపోయేలా ట్రీట్మెంట్ ఇస్తామ‌ని, నెల‌రోజుల్లో పోలీస్ వ్య‌వ‌స్థ‌ను సెట్‌రైట్ చేస్తామ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ వ‌రుస వార్నింగ్ ల‌తో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌లో వ‌ణుకు మొద‌లైంది. చంద్ర‌బాబు వార్నింగ్ త‌రువాత‌.. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గ‌గ్గోలు పెట్టారు. ఏకంగా డీజీపీ గారూ.. ప్రభుత్వాలు మారుతాయి.. కూటమి శాశ్వతం కాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జ‌గ‌న్ తీరుపై ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ కు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అప్ప‌ట్లో సీఎం హోదాలో వారిని క‌ట్ట‌డి చేయాల్సిన జ‌గ‌న్.. అలా చేయ‌లేదు. కూట‌మి ప్ర‌భుత్వంలో సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయే వారిని క‌ట్ట‌డి చేయాల‌ని చూస్తుంటే జ‌గ‌న్ కంగారు ప‌డిపోతుండ‌టం గ‌మ‌నార్హం. 

తాజాగా ఇదే అంశానికి సంబంధించి ఏపీ కాంగ్రెస్  వైఎస్ షర్మిళ కూడా స్పందించారు. సమాజానికి మంచి చేసే సోషల్ మీడియా వ్యవస్థను కొంత మంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందుతున్నారని, సోషల్ సైకోల బాధితుల్లో తాను ఒకరిగా షర్మిళ చెప్పుకున్నారు. తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై తాను కూడా పోలీస్ కేసు పెట్టినట్లు చెప్పిన షర్మిల అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.  సోష‌ల్ మీడియాలో హ‌ద్దులు మీరే వారిపై కొర‌డా ఝుళిపించి, కూట‌మి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లను ప్ర‌తీ ఒక్క‌రూ అభినందిస్తుంటే.. జ‌గ‌న్ మాత్రం వ్య‌తిరేకిస్తుండ‌టం గ‌మ‌నార్హం. సోష‌ల్ మీడియాలో నేత‌లు, వారి కుటుంబ స‌భ్యుల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టేవారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం, పోలీసులు చెబుతుంటే.. వారిని జ‌గ‌న్ బెదరించడం చూస్తుంటే.. అధికారం పోయినా కూడా జ‌గ‌న్ రెడ్డిలో మార్పు రాలేద‌ని అవగతమౌతోంది. ఇప్పటికీ జ‌గ‌న్ తీరులో మార్పు రాకుంటే రాబోయే కాలంలో వైసీపీ క‌నుమ‌రుగు కావ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వైసీపీ వ‌ర్గాల్లో నుంచి సైతం వినిపిస్తోంది.

By
en-us Political News

  
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.