Publish Date:Feb 12, 2026
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రానున్న రోజులలో అత్యంత కీలక పరిణామాలు సంభవించనున్నాయా. ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో దొంగే దొంగ అని అరుస్తున్న చందంగా వ్యవహరిస్తున్న వైసీపీ దూకుడుకు కళ్లెం వేసే విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోందా? ఇందు కోసం కేంద్రం సహాయాన్ని కోరుతూ ఒత్తిడి పెంచుతోందా అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది.
ఇందుకు వారు చూపుతున్న కారణాలేంటంటే.. ఒక్క రోజు వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హస్తిన పర్యటనలను చూపుతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హస్తిన పర్యటనకు వెళ్లారు. ఈయన ఈ నెల 9న ఢిల్లీకి బయలుదేరి వెళ్లి, ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 10న హస్తినలో కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో బిజీబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. చంద్రబాబు పర్యటన సందర్భంగానే విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అలాగే బుల్లెట్ కారిడార్ ల విషయంలో అమరావతికి రెండు బుల్లెట్ రైళ్లు అన్న ఏపీ ముఖ్యమంత్రి ప్రతిపాదనకు విత్త మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. సరే చంద్రబాబు మంత్రులతో వరుస భేటీల తరువాత అదే రోజు సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ మరుసటి రోజే అంటే మంగళవారం (డిసెంబర్ 10) రాత్రి లోకేష్ హస్తినకు చేరుకున్నారు.
అంటే చంద్రబాబు ఇలా రాగానే.. లోకేష్ అలా హస్తినలో అడుగు పెట్టారు. హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అంతకు ముందు చంద్రబాబు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దాదాపు గంటకు పైగా చర్చించారు. ఇరువురి మధ్యా ముఖాముఖీగా జరిగిన ఈ చర్చల సారాంశంపై రాజకీయవర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. ఆ భేటీ పూర్తయిన గంటల వ్యవధిలోనే లోకేష్ అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ మావేశాలరాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నప్పటికీ మంత్రి లోకేష్ హస్తినలో మెరుపు పర్యటన జరపడం.. కేంద్ర హోంమంత్రితో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
సరిగ్గా దాదాపు ఇదే సమయంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ దర్యాప్తునకు తోడుగా, ఆ వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగడంతో రానున్న రోజులలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక చర్యలకు ఆస్కారం ఉందన్న చర్చ రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున జరుగుతోంది.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 మాసాలు అయిన తరువాత కూడా.. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఉదాశీనంగా వ్యవహరించడంపై కూటమి శ్రేణుల నుంచే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుండటం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక చర్యలకు శ్రీకారం చుట్టడానికి కూటమి ప్రభుత్వం సమాయత్తమౌతున్నదనడానికి ఈ పర్యటనలు, భేటీలను విశ్లేషకులు సంకేతంగా చెబుతున్నారు. అదే నిజమైతే వైసీపీ అగ్రనేతలకు రానున్న రోజులలో చుక్కలు కనిపించడం, కటకటాలు లెక్కించడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-and-lokesh-delhi-tours-25-213940.html
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.