చంద్రబాబు, లోకేష్.. ఒకరి తరువాత ఒకరు హస్తినకు.. అసలేం జరుగుతోంది?

Publish Date:Feb 12, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రానున్న రోజులలో అత్యంత కీలక పరిణామాలు సంభవించనున్నాయా. ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో దొంగే దొంగ అని అరుస్తున్న చందంగా వ్యవహరిస్తున్న వైసీపీ దూకుడుకు కళ్లెం వేసే విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోందా? ఇందు కోసం కేంద్రం సహాయాన్ని కోరుతూ ఒత్తిడి పెంచుతోందా అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. 

ఇందుకు వారు చూపుతున్న కారణాలేంటంటే.. ఒక్క రోజు వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హస్తిన పర్యటనలను చూపుతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హస్తిన పర్యటనకు వెళ్లారు. ఈయన ఈ నెల 9న ఢిల్లీకి బయలుదేరి వెళ్లి, ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 10న హస్తినలో కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో బిజీబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. చంద్రబాబు పర్యటన సందర్భంగానే విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అలాగే బుల్లెట్ కారిడార్ ల విషయంలో అమరావతికి రెండు బుల్లెట్ రైళ్లు అన్న ఏపీ ముఖ్యమంత్రి ప్రతిపాదనకు విత్త మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. సరే చంద్రబాబు మంత్రులతో వరుస భేటీల తరువాత  అదే రోజు సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ మరుసటి రోజే అంటే మంగళవారం (డిసెంబర్ 10) రాత్రి లోకేష్ హస్తినకు చేరుకున్నారు.

అంటే చంద్రబాబు ఇలా రాగానే.. లోకేష్ అలా హస్తినలో అడుగు పెట్టారు. హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అంతకు ముందు  చంద్రబాబు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దాదాపు గంటకు పైగా చర్చించారు. ఇరువురి మధ్యా ముఖాముఖీగా జరిగిన ఈ చర్చల సారాంశంపై రాజకీయవర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది.  ఆ భేటీ పూర్తయిన గంటల వ్యవధిలోనే లోకేష్ అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.   ఏపీ అసెంబ్లీ బడ్జెట్ మావేశాలరాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నప్పటికీ మంత్రి లోకేష్ హస్తినలో మెరుపు పర్యటన జరపడం.. కేంద్ర హోంమంత్రితో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

సరిగ్గా దాదాపు ఇదే సమయంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ దర్యాప్తునకు తోడుగా, ఆ వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగడంతో రానున్న రోజులలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక చర్యలకు ఆస్కారం ఉందన్న చర్చ రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున జరుగుతోంది.   

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 మాసాలు అయిన తరువాత కూడా.. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఉదాశీనంగా వ్యవహరించడంపై కూటమి శ్రేణుల నుంచే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుండటం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక చర్యలకు శ్రీకారం చుట్టడానికి కూటమి ప్రభుత్వం సమాయత్తమౌతున్నదనడానికి ఈ పర్యటనలు, భేటీలను విశ్లేషకులు సంకేతంగా చెబుతున్నారు.   అదే నిజమైతే వైసీపీ అగ్రనేతలకు రానున్న రోజులలో చుక్కలు కనిపించడం, కటకటాలు లెక్కించడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. 

By
en-us Political News

  
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.