వివేకా హత్య కేసు.. అవినాష్ డైరక్షన్ లో సీబీఐ దర్యాప్తు!?

Publish Date:May 4, 2023

Advertisement

వివేకా హత్య కేసు దర్యాప్తు, ఆ కేసులో సీబీఐ నిందితుడిగా పేర్కొన్న అవి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది. అవినాష్ రెడ్డి అరెస్టుతో వివేకా హత్య కేసుకు ఒక తార్కిక ముగింపునకు వస్తుందని అంతా భావించారు.  అయితే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే విషయంలో సీబీఐకి ఉన్న అడ్డంకులన్నిటినీ కోర్టులు సందేహాలకు అతీతంగా తొలగించేసినా.. సీబీఐ మీనమేషాలు లెక్కించడంతో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఏ ఒత్తిడులు సీబీఐ కాళ్లూ చేతులూ కట్టేస్తున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఈ కేసులో అవినాష్ రెడ్డి మొదటి నుంచీ తాను అరెస్టవుతానన్న భావంతోనే దాని నుంచి తప్పించుకోవడానికి చేయాల్సినంతా చేశారు.  ప్రధానంగా ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించి అరెస్టు నుంచి రక్షణ పొందడానికి ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించుకున్నారు. కేసు తెలంగాణకు మారిన తరువాతే  వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయంపై సీబీఐ బలమైన వాదనలు వినిపించింది. దీంతో అవినాష్ హై కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ  వెళ్లి మరీ అరెస్టు కాకుండా ఉండేందుకు చేయగలిగినంతా చేశారు.

తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ముందస్తు బెయిలు యిచ్చి ఒకింత ఊరట కలిగించినా.. వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వ్యులను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. దీంతో ఆయనకు ఆ ఊరట కూడా లభించలేదు. అయినా హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ పెండింగ్ లో ఉందన్న సాకుతో అరెస్టు నుంచి తప్పించుకోగలిగారు. చివరికి హైకోర్టు కూడా ముందస్తు బెయిలు పిటీషన్ పై తీర్పును వాయిదా వేస్తే.. అవినాష్ ను అరెస్టు చేసి విచారించడానికి సీబీఐకి ఎటువంటి అడ్డంకులూ లేవని తేల్చేసింది.  

యిదంతా జరిగి రోజులు గడిచినా సీబీఐ మాత్రం ఆయన అరెస్టు విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.  అయితే తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిలు విషయంలో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో మాత్రం  వివేకా హత్య కేసులో  పలు కీలక అంశాలను ప్రస్తావించింది. సాక్ష్యాల మాయం నుంచి పలు అంశాలలో అవినాష్ కు ప్రమేయం ఉందనీ, ఆయనను అరెస్టు చేసి విచారించాల్సిన అవసరం ఉందనీ విస్పష్టంగా పేర్కొంది. అలాగే హత్య కొోసం నాలుగు కోట్ల సొమ్ముకు ఒప్పందానికి సంబంధించిన అంశంలో కూడా అనినాష్ రెడ్డిని విచారించాల్సి ఉందని సీబీఐ పేర్కొంది.  

అలాగే నేరాన్ని తనపై వేసుకుంటే రూ.10 కోట్లు.. ఇస్తామన్నారని గంగాధర్రెడ్డి  వాంగ్మూలంలో వాస్తవం తేల్చాలనీ సీబీఐ పేర్కొంది.  అంతే కాకుండా అవినాశ్ రెడ్డికి నేర చరిత్ర ఉందనీ, ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయనీ కూడా పేర్కొంది.  యిన్ని చెప్పిన సీబీఐ  అడ్డంకులన్నీ తొలగిపోయినా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోవడం అటుంచి..  విచారణకు పిలిచినప్పటి నుంచీ ఆయన మీడియా ఎదుట.. 
సీబీఐ సవ్యదిశలో దర్యాప్తు చేయడం లేదంటూ .. సీబీఐ ఎలా దర్యాప్తు చేయాలో చెబుతూ వస్తున్నారు. యిప్పుడు అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో వెనకడుగు వేసిన సీబీఐ.. తన దర్యాప్తును అవినాష్ చెప్పిన విధంగా సాగిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ లో డాక్టర్ సునీత దంపతులకు వివేకా హత్య కేసుతో సంబంధం లేదని విస్పష్టంగా చెప్పిన సీబీఐ..  ఆ తరువాత వారిరువురినీ విచారించింది. అలాగే  వివేకా రాసినట్లు చెబుతున్న లేఖను ఉద్దేశపూర్వకంగా ఆయన కుమార్తె.. అల్లుడు దాచేసినా పట్టించుకోలేదన్న అవినాష్ ఆరోపణలకు అనుగుణంగా దర్యాప్తు సాగిస్తోంది.  తాజాగా వివేకా పీఏ క్రిష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని  హత్య జరిగిన చోట లభించిన  లేఖను  ఎందుకు దాచారంటూ ప్రశ్నలు గుప్పించిందని చెబుతున్నారు.   మొత్తంగా సీబీఐ ప్రస్తుతం అవినాష్ లేవనెత్తిన అంశాల దర్యాప్తుపై దృష్టి సారించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవినాష్ డైరెక్షన్ లో సీబీఐ దర్యాప్తు సాగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.