అవినాష్ కు చెలగాటం.. సీబీఐకి ప్రాణ సంకటం!

Publish Date:May 16, 2023

Advertisement

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం ఆయన వ్యవధి కావాలని కోరడం.. సీబీఐ అవినాష్ కోరినట్లుగా వ్యవధి ఇవ్వడం గత కొన్ని నెలలుగా నిరాటంకంగా సాగుతోంది. ఈ వ్యవహారం మొత్తం పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అన్న సామెత గుర్తుకు వస్తోంది. అయితే ఇక్కడ పిల్లి అవినాష్ అయితే సీబీఐ ఎలుక అన్నట్లుగా ఉంది.

 సీబీఐ నిస్సహాయతను ఆసరాగా చేసుకుని అవినాష్ రెడ్డి ఆ దర్యాప్తు సంస్థతో తన ఇష్టారీతిగా ఆటలాడుకుంటున్నారు. ఈ తతంగం గత  జనవరి నుంచి ప్రారంభమైంది. గత జనవరి నుంచి ఇప్పటి వరకూ సీబీఐ నాలుగు మార్లు అవినాష్ ను విచారించింది. ముందస్తు బెయిలు కోసం అవినాష్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్ లో అవినాష్ ను అరెస్టు చేస్తామని విస్పష్టంగా చెప్పింది. కోర్టులు అవినాష్ కు ఇచ్చిన బెయిలు రక్షణను తొలగించేసినా.. కేంద్ర దర్యాప్తు సంస్థ ఆయనను అరెస్టు చేయడానికి ముందుకు రావడం లేదు. తాజాగా  సీబీఐ జారీ చేసిన నోటీసుకు ప్రతిగా అవినాష్ రెడ్డి నాలుగు రోజులు గడువు కావాలంటూ లేఖ రాసి దర్జాగా పులివెందులకు బయలుదేరి వెళ్లిపోయారు. ఆ తరువాత అవినాష్ కోరిన వ్యవధి ఇచ్చేది లేదు.. వెంటనే హాజరు కావాల్సిందేఅంటూ సీబీఐ హుకుం జారీ చేసింది. అంతలో ఏమైందో ఏమో గంట వ్యవధిలోనే అవినాష్ కోరినట్లు నాలుగురోజులు కాకుండా మూడు రోజులు గడువు ఇచ్చి ఈ నెల 19న హాజరు కావాల్సిందిగా మరో నోటీసు ఇచ్చింది.  

అసలు సీబీఐ విషయంలో  మొదటి నుంచీ కూడా అవినాష్ రెడ్డి ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తోంది. సీబీఐ కార్యాలయంలో విచారణను ఎదుర్కొని బయటక వచ్చి అదే దర్యాప్తు సంస్థపై ఇష్టారీతిన ఆరోపణలు చేసినా సీబీఐకి చీమ కుట్టినట్టు ఉండదు.

పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి.. మీరు కోరినట్లు విచారణకు హాజరు కావడానికి కుదరదంటూ అవినాష్ పదే పదే విచారణకు హాజరు కాకుండా అవాయిడ్ చేస్తున్నా.. సీబీఐ మాత్రం జీహుజూర్ మీకు కుదిరినప్పుడే రండి అన్నట్లు గడువు ఇస్తూ వస్తోంది.  ఈ వ్యవహారమంతా సీబీఐ ప్రతిష్టను మంటగలపుతోంది, పరువును గంగలో కలిపేస్తోంది. సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్న అనుమానాలకు తావిస్తోంది. ఆ దర్యాప్తు సంస్థ విశ్వసనీయతనే దెబ్బతీస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.