కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తు?.. సీబీఐ డైరెక్టర్ హైదరాబాద్ రాక!
Publish Date:Sep 6, 2025
Advertisement
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేస్తూ తెలంగాణ సర్కార్ పంపిన లేఖకు స్పందనగా సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్ వచ్చారు. కోఠీలోని సీబీఐ కార్యాలయంలో అదికారులతో శుక్రవారం (సెప్టెంబర్ 5) సవావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై దర్యాప్తు వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో సీబీఐ ఎలా ముందుకు సాగుతుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు లేవు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిషన్ నివేదిక ఆధారంగా కాకుండా మొత్తంగా కళేశ్వరం అక్రమాలపై దర్యాప్తును కోరుతూ సీబీఐకి లేఖ రాసింది. కోర్టుకు కూడా ఇదే విషయాన్నిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను సీబీఐ అక్నాలెడ్జ్ కూడా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆ రిపోర్టు ఆధారంగా కాకుండా.. జనరల్ గానే కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తు చేయాలని లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ డైరెక్టర్ హైదరాబాద్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత సంతరించుకున్న కాళేశ్వరం అక్రమాలు, అవినీతిపై సీబీఐ దర్యాప్తు ఏలా సాగుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
http://www.teluguone.com/news/content/cbi-director-in-hyderbad-39-205679.html





