'బిర్యానీ' రుచి మరుగుతోన్న నిరసనకారులు!

Publish Date:Sep 19, 2016

Advertisement

కొన్ని సంఘటనలు అప్పటికప్పుడు షాక్ కి గురి చేస్తాయి! కాని, తరువాత మెల్లిమెల్లిగా మన సమాజంలోని సత్యాన్ని బయటపెడుతూ ఆందోళన కలిగిస్తాయి! అలాంటిదే ఈ మధ్య జరిగిన కావేరీ జలాల గొడవ, దాని తాలూకూ విద్వంసం... తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరీ జలాల పంపకంపై గొడవ ఈనాటిది కాదు. అది రెండు వైపుల ప్రజల్లో దారుణమైన సెంటిమెంట్ గా మారిపోయింది. దానికి రాజకీయ నాయకులు ఆజ్యం పోసీ పోసీ జనాన్ని శత్రువులుగా మార్చేశారు. ఇదొక పెద్ద విషాదం. ఒక నది నీళ్లు న్యాయంగా పంచుకోవటానికి కూడా వీలుపడని అమానుష స్థితి సాటి భారతీయుల మధ్య ఏర్పడటం... చాలా ఆందోళనకరం!

కావేరీ జలాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రాజకీయ నేతల వ్యవహార శైలి.... ఇదంతా ఒక ఎత్తైతే... అసలు విషాదం మరొకటి వుంది. ఎక్కడో సుప్రీమ్ కోర్టు తమిళనాడుకు నీళ్లివ్వాలని కర్ణాటకను ఆదేశిస్తే బెంగుళూరులో విధ్వంసం జరిగింది. అదీ జనం తమంత తాముగా రోడ్ల మీదకి వచ్చి బస్సలు, టైర్లు తగులబెట్టారన్నట్టుగా ప్రచారం జరిగింది. కాని, కాస్త ఆలోచిస్తే దీంట్లో బోలెడు కుట్ర కనిపిస్తుంది. కావేరీ జలాల అవసరం అత్యంత ఎక్కువగా వుండేది కర్ణాటక రైతులకి. వాళ్లు విధ్వంసం సృష్టించిన దాఖలాలు కనిపించటం లేదు. ఎవరో ముక్కూ, మొఖం తెలియని బెంగుళూరు నగరంలోని అల్లరి మూకలు బస్సుల్ని తగులబెట్టాయి. వీళ్లకు కావేరీ జలాల మీద, రైతుల మీద ఎందుకంత ప్రేమ? ఎవరు వాళ్లని ఉసిగొల్పుతున్నారు? ఇవే అసలు ప్రశ్నలు!

కర్ణాటకలోనే కాదు ఆ మధ్య రాష్ట్ర విభజనకి ముందు మన తెలుగు నేలపై కూడా ఇదే జరిగేది! ఒక పద్ధతి ప్రకారం ఏర్పడ్డ వ్యవస్థ గంటల వ్యవధిలో నిరసనకారుల్ని రోడ్లపైకి తెచ్చేసేది. తెలంగాణ కావాలన్నా కోరిక, సమైక్యాంధ్ర వుండాలన్న తపన ... ఈ రెండూ నిజమే అయినా జనం తమంత తాముగా వీదుల్లోకి రారు. మరి వాళ్లను ఎవరు తీసుకొస్తున్నారు? దీనికి సమాధానమే బిర్యానీ బ్యాచీ! దేశంలో ఎంత పెద్ద ఉద్యమమైనా, లేదంటే ఎంత పెద్ద బహిరంగ సభ అయినా, కాదంటే ఎంత పెద్ద ఓదార్పు యాత్రైనా... ఇలా ఎక్కడ ఏ కార్యక్రమానికి జనం అవసరం అయినా  బిర్యానీ టెక్నిక్ వాడుతున్నారు ఈవెంట్ మ్యానేజర్స్! ఓ బిర్యానీ, రెండొందలో, మూడొందలో డబ్బు ఇస్తే ఇన్స్టాంట్ ఉద్యమకారులు ప్రత్యక్షమం అవుతన్నారు. వీళ్ల మద్యే పాపం కొంత మంది నిజాయితీ పరులు కూడా తమ వర్గమో, జాతి క్షేమం కోసమో పోరాడవచ్చు. కాని, ఈ అసలు కంటే కొసరు శాల్తీలు మరీ ఎక్కువైపోతున్నాయి. ఎన్నికల ప్రచారం నుంచి మొదలు పెడితే తాజా కావేరీ జలాల నిరసనల వరకూ అంతటా బిర్యానీ బ్యాచీనే!

ఏ నిరసన, ఏ ధర్నా, ఏ రాస్తారోకో అయినా బిర్యానీ పెట్టించి జనాన్ని తేవటం పెద్ద ప్రమాదకరం ఏం కాదు అనుకుంటే పొరపాటే. బెంగుళూరులో కావేరీ జలాల గొడవ నేపథ్యంలో కేపీఎన్ అనే సంస్థ తాలూకూ బస్సుల్ని నిరసనకారులు తగులబెట్టారు. ఒకటి రెండు కాదు 42బస్సుల్ని దహనం చేశారు. దీనికి ప్రధాన కారణం అంటూ పోలీసులు ఓ 22ఏళ్ల యువతిని అరెస్ట్ చేశారు! ఆశ్చర్యకరంగా ఆమె ఎవరో పార్టీ మనిషి కాదు, పోనీ ఏదో సంఘానికి నాయకురాలు కూడా కాదు. కేవలం కూలి పని చేసుకునే పేదరాలు! కూలీకి వెళ్లే 22ఏళ్ల మహిళ తనకు బిర్యానీ పెట్టి వంద రూపాయలు ఇస్తారంటే నిరసనల్లోకి వచ్చింది. తీరా వచ్చాక తానేం చేస్తుందో తనకు తెలిసేలోపే ఇతర నిరసనకారుల్ని రెచ్చగొట్టి 42 బస్సుల్ని తగులబెట్టించింది. కేపీఎన్ సంస్థ ఉద్యోగుల పై కూడా డీజిల్ పోశారట! అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం కాలేదు!

పోలీసులు చెబుతున్నట్టు బిర్యానీ కోసం రోడ్డుపైకి వచ్చిన ఒక పేదరాలే నిజంగా దారుణమైన విధ్వంసానికి కారణం అయితే ... దీనిపై గట్టి నిఘా పెట్టాల్సిందే! ఏ కార్యక్రమం జరిగినా జనం ఎక్కడ్నుంచి వస్తున్నారు, ఎవరు తెస్తున్నారు, ఎలా వాళ్లని తీసుకొచ్చే వారు కన్విన్స్ చేస్తున్నారు... ఇవన్నీ నిఘా సంస్థలు కనిపెడుతూ వుండాలి. లేదంటే... బెంగుళూరు తరహా అరాచకం మళ్లీ మళ్లీ జరిగే ప్రమాదం వుంది! 
 

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.