ఏబీవీ సస్పెన్షన్ ను కొట్టేసిన క్యాట్!

Publish Date:May 8, 2024

Advertisement

సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్  ఏబీ  వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను క్యాట్ కొట్టేసింది. తనను రెండో సారి జగన్ సర్కార్ సస్పెండ్ చేయాడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఏబీవీ పిటిషన్ పై వాదనలు పూర్తై తీర్పు రిజర్వ్ చేసిన క్యాట్ ఆ తీర్పును రిజర్వ్ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావును రెండో సారి సస్పెండ్ చేయడం న్యాయ విరుద్ధమని క్యాట్ స్పష్టం చేసింది.  ఆయనను తక్షణమే సర్వీసులోనికి తీసుకుని   ఏరియర్స్ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. ఏబీవెంకటేశ్వరరావు సస్పెన్షన్  చట్ట విరుద్ధమని దేశ సర్వెన్నత న్యాయస్థానం విస్పష్ట తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఆయన రెండో సారి సస్పెండ్ చేయడం వేధింపుల కిందకే వస్తుందని క్యాట్ తన తీర్పులో పేర్కొంది.  


నిఘా పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ రావుపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో న్యాయ వివాదం మొదలైంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.  తన సస్పెన్షన్ ను ఏబీవీ క్యాట్ లో సవాల్ చేశారు. అయితే అప్పట్లో క్యాట్ ఏబీవీ సస్పెన్షన్ ను సమర్ధించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు క్యాట్  నిర్ణయాన్ని కొట్టివేసింది. ఆయనను విధుల్లోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పును జగన్ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ తీర్పు వెలువరించింది.

దీంతో సుప్రీం కోర్టు ఆదేశానుసారం రాష్ట్రప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేసి విధుల్లోకి తీసుకుంది. అయితే ఇలా విధుల్లోకి తీసుకున్నట్లే తీసుకుని మళ్లీ పాత ఆరోపణలతో రెండో సారి సస్పెండ్ చేసింది.  ఒకే ఆరోపణలపై రెండో సారి సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఏబీవీ క్యాట్ ను ఆశ్రయించారు. క్యాట్ ఆయన సస్పెన్షన్ ఎత్తివేసింది. 

By
en-us Political News

  
ఎన్నో అంచనాలతో విడుదలైన వైసీపీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నిర్మాత, దర్శకుడు, హీరో అయిన జగన్ ఈ సినిమాని హింసాత్మకంగా, దారుణంగా రూపొందించడంతో ఆంధ్రా ప్రజలు రిజెక్ట్ చేశారు. ఫస్ట్ రిలీజ్‌లోనే ఈ సినిమాని జనం భరించలేకపోయారు.. ఇక సెకండ్ రిలీజ్ కూడానా?!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆయన అజర్ బైజాన్ వెళ్తూ వుండగా వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలిపోయిందని తెలుస్తోంది.
భూటాన్ రాజధాని ధింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిష్ట్ టూర్ ఆపరేటర్స్ కార్యాలయాన్ని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ప్రారంభించినట్టు ఏబీటీవో ప్రధాన కార్యదర్శి డాక్టర్ కౌలేష్ కుమార్ తెలిపారు.
గ‌తం కంటే ఎక్కువ స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామంటూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల ఐప్యాక్ బృందంతో స‌మావేశ‌మైన స‌మ‌యంలో ధీమా వ్య‌క్తం చేశారు. వైసీపీ ముఖ్య నేత‌లు సైతం 150 నుంచి 160 స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామ‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు.
రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడలు కావ‌డానికి పెద్ద ఎక్కువ కాలం ప‌ట్ట‌దు. అధికారంలో ఉన్నంత సేపు ఈగ‌ల గుంపులా పార్టీ ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసే నేత‌లు.. అధికారంలో కోల్పోయిన త‌రువాత వారి వైపు కూడా చూడ‌రు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-17
ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి సాధారణ స్థితి పునరుద్ధరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించేశారు.
న్నికలలో విజయం సాధించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలే కొంత కాదు.. చాలా బాధను కలిగిస్తున్నాయి. 
పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
సర్వేలు, ఫలితాలు కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో. ఆయన అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది.
పాపం ఈయనేమో జగన్ పేరు చెబితే ఆనందంతో గుడ్డలు చించుకుంటూ వుంటాడు. వాళ్ళేమో ఈయన్ని కూరలో కరేపాకుని తీసేసినట్టుగా తీసి అవతల పారేస్తూ వుంటారు. కేసీఆర్‌కి ఇలాగే అవ్వాలిలే!!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.