Publish Date:Feb 11, 2020
కమ్మ అధికారులు, ఉద్యోగులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా కమ్మ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసిన జగన్మోహన్ రెడ్డి... ఇఫ్పుడు అధికారంలోకి వచ్చాక తన కసి తీర్చుకుంటున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర్రావును సస్పెండ్ చేయడం వెనుక... అతనిపై జగన్మోహన్ రెడ్డికున్న తీవ్రమైన కోపమే కారణమంటున్నారు. సెక్యూరిటీ ఎక్విప్ మెంట్ కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారని, అలాగే కాండక్టు రూల్స్ ధిక్కరించారంటూ రూల్ 3(1) కింద ఏబీ వెంకటేశ్వర్రావును జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే, ప్రభుత్వ వాదన.... క్యాట్ లో నిలబడదనే మాట వినిపిస్తోంది. జగన్ సర్కారు మోపిన అభియోగాలు కోర్టులో నిలబడవంటున్నారు.
ఎందుకంటే, చంద్రబాబు హయాంలో సుమారు 22కోట్ల రూపాయలతో కేంద్రం అనుమతితో కొనుగోలు చేసిన సెక్యూరిటీ ఎక్విప్ మెంట్ కోసం ఏర్పాటు చేసిన రెండు కమిటీల్లో ఏబీ వెంకటేశ్వర్రావు సభ్యుడిగా లేకపోవడం అతనికి కలిసొస్తుందని అంటున్నారు. పైగా అప్పటి బాబు ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టు అప్పగించింది. అందువల్ల ఏబీవీపై సస్పెన్షన్ చెల్లదని అంటున్నారు. అసలు ఎక్విప్ మెంట్ కొనుగోళ్ల కమిటీల్లో సభ్యుడిగా లేడు.... పైగా అవి గ్లోబల్ టెండర్లు... అలాంటప్పుడు ఏబీ వెంకటేశ్వర్రావును ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇక, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఏబీ వెంకటేశ్వర్రావుకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వైసీపీ సర్కారు, ఇప్పుడు ఏకంగా సస్పెండ్ చేసి కసి తీర్చుకున్నారని అంటున్నారు. ఎనిమిది నెలలుగా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టడమే కాకుండా జీతం కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన జగన్ ప్రభుత్వం... ఇప్పుడు ఏకంగా సస్పెండ్ చేయడం దారుణమంటున్నారు. ఒకవేళ నిజంగానే అవకతవకలు జరిగి ఉంటే పోస్టింగ్ లో ఉండగానే చర్యలు తీసుకోవాల్సిందని అంటున్నారు. కావాలనే కక్షపూరితంగా ఏబీవీని సస్పెండ్ చేశారని తోటి ఐపీఎస్ లు వ్యాఖ్యానిస్తున్నారు. తన వేతనం ఇవ్వాలంటూ ఏబీ వెంకటేశ్వర్రావు ప్రభుత్వానికి రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నారని, దీన్ని బట్టే ఎంతలా ఏబీవీని వేధించారో అర్ధమవుతోందంని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cat-may-give-shock-to-ap-govt-over-abv-suspension-25-94101.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.