వంద మందికి పైగా వైసీపీ నేతలపై కేసులు.. కారణమేంటో తెలుసా?

Publish Date:Jul 7, 2025

Advertisement

అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగిపోయినా చెల్లినట్లు, అధికారం కోల్పోయిన తరువాత కూడా చెలరేగిపోతామంటే కుదరదన్న విషయం ఇప్పుడు వైసీపీ నాయకులు, క్యాడర్ కు ఇప్పుడు బాగా తెలిసివస్తోంది. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి లెక్క చేసే పనే లేదంటూ ఇంత కాలం చెలరేగిపోయిన వైసీపీ నాయకులు, క్యాడర్ ఇప్పుడు ఉలిక్కిపడుతున్నారు. ఏక కాలంలో వంద మందికి పైగా వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. నోటీసులు కూడా అందాయి. దీంతో ఏం చేయాలో తెలియకు వైసీపీ ఉక్కిరిబిక్కిరైపోతోంది.

ఇంతకీ అసలు ఒకే సారి ఇంత మందిపై కేసులు, నోటీసుల వెనుక కారణమేంటంటే.. జగన్ ఇటీవల చేసిన రెంటపాళ్ల యాత్ర. జగన్ రెండపాళ్ల పర్యటన విషయంలో పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ ర్యాలీలో పాల్గొనే వారి సంఖ్యపైనా, జగన్ ర్యాలీలో ఉండాల్సిన కార్ల సంఖ్యపైనా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే వైసీపీ ఆ ఆంక్షలు, ఆదేశాలను తుంగలో తొక్కి ఇష్టారీతిగా వేల మందితో, వందల కార్లతో ర్యాలీ నిర్వహించింది. ఆ సందర్భంగా జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సంగయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించాడు. దీనిపై పోలీసులు వైసీపీ నియోజకవర్గాల ఇన్ చార్జ్ లకు, పలువురు కీలక నేతలకు నోటీసలుు పంపి, వారిపై కేసులు నమోదు చేశారు. జగన్ వాహనం కింద పడి సింగయ్య మరణించిన కేసు నడుస్తోంది. ఈ కేసులో జగన్ ఏ2గా ఉన్నారు.

ఇప్పుడు దానికి అదనంగా పోలీసుల అనుమతి లేకున్నా ర్యాలీ నిర్వహించడం, డీజే ఉపయోగించడం, అలాగే ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం, పోలీసు విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలతో మాజీ మంత్రులు విడదల రజనీ, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, దేవినేని అవినాష్, నంబూరు శంకరరావు, బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శ్రవన్ సహా మొత్తం 113 మందిపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు.  ఈ పరిణామంతో వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పైకి బింకంగా కోర్టులో తేల్చుకుంటామంటూ చెబుతున్నా.. క్యాడర్ లో మాత్రం తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని పార్టీ వర్గాలు వర్రీ అవుతున్నాయి. ఇక పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తల హాజరు అంతంత మాత్రంగానే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

By
en-us Political News

  
ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఒక వేళ మద్దతు ప్రకటించకపోయి ఉంటే అందరూ ఆశ్చర్యపోయి ఉండే వారు. అయితే ఎవరినీ ఆశ్చర్యపరచడం ఇష్టం ఉండని జగన్ తమ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ద్వారా ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కే వైసీపీ మద్దతు అని ఒక ప్రకటన చేయించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజక వర్గం ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం కానుకగా చీర, పసుపు కుంకుమ పంపించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మొయినాబాద్ వద్ద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ దాయాది దేశాల క్రికెట్ జట్ల మధ్య మరో పోరుకు వేదిక కానుంది. త్వరలో జరగనున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా టీమ్ ఇండియా, పాకిస్థాన్ జట్ల తలపడనున్నాయి.
ఓ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆ తల్లి పడే ప్రసవవేదన ఏమిటో మన అందరికీ తెలిసిందే… అలాగే ఒక పరిశ్రమ … ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి భూములు కోల్పోయే రైతులు పడే ఆవేదన అంతకు ఏ మాత్రం తక్కువ కాదు.
గోదావరి నదికి వరద కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 14 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
గత 18 రోజులుగా చేస్తున్న సమ్మెను సినీ కార్మికులు విరమించారు.
మద్యం స్కాం నిందితులను పరామర్శించే విషయంలో జగన్ ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం నిందితులను మినహాయిస్తే.. జగన్ ఇతర కేసుల్లో అరెస్టైన తమ పార్టీ నేతలు, కార్యకర్తలను జైలుకెళ్లి పరామర్శించారు.
మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలిపారు.
ఫాల్కన్ స్కామ్ కేసులోలో చార్టర్డ్ అక్కౌంటెంట్ శరత్ చంద్ర టోస్ని వాలి కీలక పాత్ర పోషించినట్లు వెలుగులోకి వచ్చింది. శరత్ చంద్రను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
ఆయన వయస్సు ఎనిమిది పదులు. అలాంటి వృద్ధుడిని మాయమాటలు, శృంగార చేష్టలతో ట్రాప్ చేసి దారుణంగా మోసం చేశారు. 80 ఏళ్ల వృద్ధుడితో మహిళ గొంతుతో మాట్లాడి మరీ హనీట్రాప్ లో చిక్కుకునేలా చేశారు. ఎనిమిది లక్షలు కొట్టేశారు.
కాకరాల సత్యనారాయణ.. ఈ పేరు ఎక్కడో బాగా విన్నట్లే అనిపిస్తుంది కదా! ఈయన ఓ మంచి రచయిత. అంతే కాదు 300 పైగా సినిమాల్లో నటించారు. విప్లవ రచయితగా పేరుగాంచిన కాకరాల సత్యనారాయణ కుమార్తె ఒక పెద్ద మావోయిస్టు.
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం భక్త జన సంద్రంగా మారింది. తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.