అనంత ఎస్పీ ఫకీరప్పపై కేసు నమోదు
Publish Date:Aug 31, 2022
Advertisement
అనంతపురం ఎస్పీ ఫకీరప్పపై టూటౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఎస్పీ ఫకీరప్పతో పాటు ఏఎస్పీ హనుమంతప్ప, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషాపై కేసులు నమోదు చేశారు. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్‌ను సర్వీస్ నుంచి ఎస్పీ ఫకీరప్ప డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే.. అయితే, కానిస్టేబుల్‌పై ఐదు క్రిమి నల్ కేసులు ఉండటంతో పోలీసు ఉన్నతాధికారుల కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్ప డ్డారని ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై ప్రకాష్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దళితుడిననే చిన్నచూపుతో కుట్రపూరి తంగా తనపై తప్పుడు విచారణ జరిపి.. వాంగ్మూలాన్ని రికార్డు చేశారని ప్రకాష్ పేర్కొన్నాడు. ఇందుకు బాధ్యులైన పోలీసు అధి కారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌పై ఐదు క్రిమినల్ కేసులు ఉండడంతో పోలీసులు ప్రకాశ్‌ను సస్పెండ్ చేశారు. అంతేకాక, పోలీసు క్వార్టర్ ఖాళీ చేయాలని మంగళవారం నోటీసులు కూడా పంపారు. దీంతో ఆగ్రహించిన ప్రకాశ్.. బాధితురాలు లక్ష్మికి పది లక్షల రూపా యలు ఇచ్చి మరణ వాంగ్మూలం మార్చేశారని, దళితుడైన తనపై చిన్న చూపుతో కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపిం చారు. ఇందుకు బాధ్యులైన పోలీస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. 2019లో తనపై నమో దైన కేసు కోర్టులో విచారణ నడుస్తుండగానే పోలీసులు విచారణ చేపట్టి దోషిగా తేల్చారని మండిపడ్డారు. ప్రస్తుత సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ పాషా, ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ఇద్దరు సీఐల నేతృత్వంలో పూర్తి పక్షపాతంగా విచారణ సాగిందని వ్యాఖ్యా నించారు. నేరం రుజువైందని వారికి వారే నిర్ణయించుకొని ఉద్యోగం నుంచి తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఏఆర్ కాని స్టేబుల్ భానుప్రకాష్ వివాదం రోజురోజుకు ముదురుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఎఫ్ఐఆర్ నమో దు చేస్తున్న సమయంలో ఎస్పీ ఫక్కీరప్ప టూ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. కొద్దిసేపటి తరువాత అక్కడి నుంచి వెళ్లి పోయా రు. అనంతరం సిఐ శివరాముడు ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎస్పీ, ఏ ఎస్పీ, డీఎస్పీపై నమోదైన కేసుకు సంబంధించి డీఐజీ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతుందని సీఐ వెల్లడించారు. అయితే.. ఇతర జిల్లాకు చెందిన ఉన్నతా ధికారితో విచారణ జరిపించాలని డీఐజీ నిర్ణయించినట్లు పేర్కొంటున్నారు.
http://www.teluguone.com/news/content/case-registered-on--sp-pakirappa-25-142992.html





