Publish Date:May 28, 2025
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత మంత్రి నారా లోకేశ్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ను నియమించాలని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మహానాడులో తీర్మానించారు. ఈ విషయమై గుంటూరు జిల్లా స్థాయిలో జరిగిన మినీ మహానాడులో తీర్మానం చేసినట్లు చంద్రబాబుతో ఎమ్మెల్యే తెలియజేశారు
Publish Date:May 28, 2025
కడప మహానాడు వేదికగా ఐటీ, విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ప్రమోషన్ లంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీలో, ప్రభుత్వంలో తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్ కు టీడీపీలో నిర్ణయాత్మక పదవి ఇచ్చేందుకు కడప మహానాడు వేదిక అవుతుందన్న ప్రచారం జోరందుకుంది.
Publish Date:May 28, 2025
భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు అన్నారు. రెండో రోజు మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.
Publish Date:May 28, 2025
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. వచ్చారు. అందులో విశేషం లేదు. మరో రెండు మూడు రోజుల్లో ఈ నెల 30న మరో సారి కూడా వెడతారు. గ డచిన 17 నెలల్లో మొత్తం 44 సార్లు.. అంటే సగటున నెలకు రెండు సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్రలు చేశారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. నెలలో రెండు సార్లు కాదు, ఒకే రోజులో రెండు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Publish Date:May 28, 2025
వైసీపీ సోషల్ మీడియా వింగ్ మాజీ హెడ్ పిల్ల సజ్జల అదేనండీ.. సజ్జల భార్గవరెడ్డి మంగళగిరి పోలీసు స్టేషన్ లో ఉన్నారు. సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు కేసులో ఆయనకు జారీ అయిన నోటీసుల మేరకు విచారణకు ఆయన మంగళగిరి పోలీసు స్టేషన్ కు వచ్చారు.
Publish Date:May 28, 2025
నటుడిగా, నాయకుడిగా అంతకు మించి గొప్ప దార్శనికుడిగా ఎన్టీఆర్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ప్రధాని ఆయనకు ఘన నివాళులర్పించారు.
Publish Date:May 28, 2025
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించారు. జూనియర్ తో పాటు ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ కూడా ఉన్నారు.
Publish Date:May 28, 2025
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఒక సంఘ సంస్కర్త అని, సంక్షేమానికి సరికొత్త మార్గం చూపిన మహనీయుడని కొనియాడారు.
Publish Date:May 28, 2025
కడన వేదికగా జరుగుతున్న తెలుగుదేశం మహానాడులో రెండో రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజు తీర్మానం ప్రవేశ పెడతారు.
Publish Date:May 28, 2025
తెలుగుదేశం పెద్ద పండుగ మహానాడు ఈ సారి కడపలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి రోజు మంగళవారం (మే26) పూర్తిగా పార్టీ అజెండాలపైనే సాగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు లోకేశ్ తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలో సోషల్ రీఇంజినీరింగ్, అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత అన్న ఆరు శాసనాలను ప్రతిపాదించారు.
Publish Date:May 27, 2025
పైకి జంతుప్రేమికురాలిగా నటిస్తూ.. కుక్కలను చంపి తింటున్న మహిళ ఉదంతం చైనాలో వెలుగు చూసింది. గతంలో చైనాలో కుక్క మాంసంపై ఎలాంటి ఆంక్షలు లేకపోయినా.. కరోనా అనంతరం నిబంధనలు కఠినతరం చేసారు. కుక్కమాంసం తినడం పై నిషేధం విధించారు.
Publish Date:May 27, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పొటెత్తుతున్నారు.
Publish Date:May 27, 2025
తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్. తెలుగు నేల, తెలుగు జాతి ఉన్నంత వరకూ గుర్తుండి పోయే మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. తెలుగుజాతి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన సందర్భంలో ఆయన చేసిన సింహ గర్జన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది.