మాజీ మంత్రి ఎర్రబెల్లిపై కేసు
Publish Date:Feb 2, 2026
Advertisement
తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును సిట్ విచారణకు పిలవడానికి నిరసనగా ఆదివారం (ఫిబ్రవరి 1)న భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నేతృత్వంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఖమ్మం, వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి వారు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మాజీ మంత్రి ఎర్రబెల్లి సహా 34 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీసు స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
http://www.teluguone.com/news/content/case-on-former-minister-erranelli-dayakar-rao-25-213388.html





