బాల్క సుమన్ పై కేసు
Publish Date:May 27, 2026
Advertisement
బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ పై హైదరా బాద్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. బాల్కసుమన్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. సింగరేణి సంస్థకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయాలని, అవసరమైతే మిలిటెంట్ తరహా ఉద్యమాలకు సిద్ధం కావాలని బాల్క సుమన్ వ్యాఖ్యానించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య వ్యవ స్థ లో హింసను ప్రోత్సహిం చేలా మాట్లాడటం చట్టవిరుద్ధమని, ఇటువంటి వ్యాఖ్యలు శాంతిభద్రతలకు ముప్పు కలిగించే అవకాశం ఉందని వారు తమ ఫిర్యా దులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం బాల్క సుమన్‌పై కేసు నమోదు చేశారు. ఆయన చేసిన ప్రసంగాల వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు, సభలలో చేసిన వ్యాఖ్యల రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే సంబంధిత సెక్షన్ల కింద మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ.. ప్రజలను హింసాత్మక చర్యలకు ప్రేరేపించే రాజకీయాలను సమర్థించబోమన్నారు. ప్రజా ఆస్తుల ధ్వంసాన్ని ప్రోత్సహించడం, బాధ్యతా యుత రాజకీయ నాయకుడికి తగదని విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం బాల్క సుమన్ వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోం దని ఆరోపిస్తున్నాయి. సింగరేణి సంస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. ఆ ఆస్తులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
http://www.teluguone.com/news/content/case-on-balka-suman-36-221012.html





