Publish Date:Sep 25, 2024
యూట్యూబర్ హర్షసాయిపై నార్సింగ్ పోలీసులు అత్యాచారం, బ్లాక్ మెయిల్, హత్యాయత్నం తదితర కేసులు నమోదు చేశారు. ముంబైకి చెందిన యువతిని హర్షసాయి మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆమె వద్ద నుంచి రెండు కోట్ల రూపాయలను హర్షసాయి వసూలు చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేసినట్లు ఆ యువతి హర్షసాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్య వివాదం సద్దుమణగకముందే కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్ట వర్మపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ రెండు కేసులు కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగాయి. తాజాగా యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.హర్షసాయిపై గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/case-against-youtuber-harshasai-25-185536.html
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.