మీడియా సమావేశాల్లో జగన్ బోరింగ్.. విజయసాయి ఇంట్రెస్టింగ్.!

Publish Date:Oct 1, 2026

Advertisement

కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ఎంపీ విజయసాయిరెడ్డి, వరుస ప్రెస్ మీట్లతో ఒకదాని వెంట ఒకటిగా సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఆయన వైజాగ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పిన విషయాలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చెప్పిన విషయం, ప్రస్తావించిన అంశం, వెల్లడించిన వివరాలను అలా ఉంచితే..   పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 

విజయసాయిరెడ్డి  కొత్త పార్టీ రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది పక్కనపెడితే..  వైసీపీ అధినేత  జగన్‌  సమావేశాల కంటే సాయిరెడ్డి ప్రెస్‌మీట్లే ప్రజల్లో ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  వివిధ అంశాలపై వైఎస్ జగన్ సుదీర్ఘంగా ప్రసంగించడమే కాకుండా, గణాంకాలు, పోలికలపైనే ఎక్కువ దృష్టిపెడుతుంటారు.

దీంతో ఆయన విలేకరుల సమావేశాలు సాగదీతగా, రొడ్డకొట్టుడు ప్రసంగాలుగా మీడియా ప్రతినిథులు చెబుతుంటారు. అంతే కాకుండా జగన్ ప్రెస్ మీట్లలో గణాంకాల విషయంలో ఫ్యాక్చువల్ ఎర్రర్స్ సర్వసాధారణమి  చెబుతారు.దీంతో ఆయన మాట్లాడే విషయంలోని తప్పులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవ్వడమే కాకుండా, జగన్ ను కూడా ట్రోల్ మెటీరియల్ గా మర్చేస్తుండటం కద్దు.

అయితే అందుకు భిన్నంగా విజయసాయిరెడ్డి మీడియా సమావేశాలు రంజుగా, పసందుగా, పదునుగా, స్ట్రాటజిక్ గా సాగుతుంటాయి.  గణాంకాల జోలికి పోకుండా, ప్రజలను,  మీడియాను ఇట్టే ఆకట్టుకునే సంచలన రాజకీయ విమర్శలకు విజయసాయి ప్రాధాన్యత ఇస్తారు.  

ఉదాహరణకు చెప్పాలంటే.. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం, మత మార్పిడులు, వైసీపీలో సజ్జల ఆధిపత్యం, పార్టీలో అంతర్గతంగా ఆయన సాగిస్తున్న అరాచకం, తననే స్వయంగా కొట్టారంటూ సజ్జలపై సంచలన ఆరోపణలు,   విశాఖపట్నం వర్సెస్ మావిగున్   వంటి వాటిని ఆయన ప్రస్తావిస్తూ, ఇటు మీడియానూ, అటు ప్రజలనూ ఏకకాలంలో ఆకట్టుకోగలుగుతున్నారు.

అన్నిటికీ మించి దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికీ, వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ జగన్ కు సన్నిహితంగా మెలిగిన విజయసాయి రెడ్డి.. ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలను సహజంగా జనం నమ్ముతున్నారు. కేవలం సంచలన వ్యాఖ్యలుగా కొట్టిపారేయకుండా, అందులో వాస్తవం ఉండే ఉంటుందన్న కోణంలో చర్చ జరుగుతోంది.  ఈ కారణంగానే జనం విజయసాయి ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు? ఏ సంచలన విషయాలు వెల్లడిస్తారు? అని ఆసక్తిగా చూస్తున్నారు.  

[Vijayasai Reddy Jagan, AP Politics, Visakhapatnam, Press meet, YSR Congress Party, Vijayasai, New Party, Telugu One]

By
en-us Political News

  
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.