టి.ఆర్.ఎస్. కు షాకులిస్తున్న బిజెపి?
Publish Date:May 18, 2012
Advertisement
తెలంగాణా రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్.)కు శాకులిచ్చేందుకు భారతీయజనతాపార్టీ (బిజెపి) సిద్ధమైంది. ముందుగా ప్రత్యేక తెలంగాణా నినాదాన్ని నెత్తిన పెట్టుకున్నది బిజెపియేనన్నది జగమెరిగిన సత్యం. అదీ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన ఆ పార్టీ రాష్ట్రమహాసభల్లో. ఈ మేరకు తీర్మానం కూడా చేసింది. ఆ ఏడాదే బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే అప్పటి వరకూ రాష్ట్రంలో స్పీకర్ గా ఉన్న చంద్రశేఖర రావు (ప్రస్తుత టి.ఆర్.ఎస్. అధినేత) తన పదవికి రాజీనామా చేసి టి.ఆర్.ఎస్.ను ఏర్పాటు చేశారు. తెలంగాణా వాదాన్ని తెలివిగా ఉపయోగించుకున్నాడు. టి.ఆర్.ఎస్. ఎన్నికల్లో కూడా అనూహ్యంగా విజయాలు సాధిస్తుండడంతో కమలనాథుల్లో కలవరం మొదలైంది. మొదట తామే తెలంగాణాకు అనుకూల తీర్మానాన్ని చేసినప్పటికీ ఫలితాలను మాత్రం కేసిఆర్ అనుభవిస్తున్నారన్న భావన బిజెపి నేతల్లో కలిగింది. అయినా ఎక్కడా బయటపడకుండా తనవంతు కృషి చేసిన బిజెపిని తెలంగాణావాదులూ గుర్తించడం మొదలుపెట్టారు. అందుకే మహబూబ్ నగర ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. ఇది టి.ఆర్.ఎస్. అధినేతకు ఒక పెద్ద షాక్ కూడా అయింది. అయితే ఇదే ట్రీట్ మెంట్ ను కొనసాగించాలని తెలంగాణా బిజెపి నేతలు భావిస్తున్నారు. అందుకే పరకాల ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని పోటీలోకి దింపు తున్నారు. అంతే కాకుండా ఆ అభ్యర్థి విజయానికి అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్లాన్ రూపొందించింది. ఈ ప్లాన్ మొదటి దశలో భాగంగా బిజెపి కేంద్ర నేత సుష్మాస్వరాజ్ ను రప్పించాలని బిజెపి భావిస్తోంది. ఈలోగా తమ పార్టీ తలన్గానా ప్రత్యేకరాష్ట్రం కోసం చేసిన డిమాండును అప్పట్లో ప్రచురించిన మీడియా కథనాలను ఓటర్ల ముందుకు తేవాలని బిజెపి యోచిస్తోంది. లోక్ సభలో సుష్మా అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రత్యేకతెలంగాణా కోసం చేసిన ఉపన్యాసాలు కూడా ఓటర్లకు వినిపించాలని బిజెపి భావిస్తోంది. త్వరలో జరగబొయే సుష్మాస్వరాజ్ ఎన్నికల సభలకు పెద్ద ఎత్తున సన్నాహాలు కూడా చేస్తోంది.
http://www.teluguone.com/news/content/bjp-contineous-shocks-to-trs-24-14130.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





