చావు అంచుకెళ్లి తిరిగి వచ్చిన మృత్యుంజయులు!
Publish Date:Jul 19, 2022
Advertisement
మధ్యప్రదేశ్‌లో కుండపోత వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలోని నదలు, వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో కొందరు ప్రమాదవశాత్తున వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి పలు సంఘటనల్లో కొందరు అదృష్ట వశాత్తూ మృత్యు ముఖం నుంచి బయట పడ్డారు. అటువంటి సంఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిని జిల్లా మహిద్‌పూర్‌లో ఓ బొలెరో వాహనం వరదల్లో కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లకు భయంతో రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. బొలెరో వాహనం బ్రిడ్జి పైకి రాగానే నీటి ప్రవాహ తీవ్రతను అంచనావేయడంలో విఫలమైన డ్రైవర్ మొండిగా వాహనాన్ని ముందుకు కదిలించాడు. కొంత దూరం వెళ్లగానే వాహనం ఆగిపోయింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వాహనం కొట్టుకపోయింది. వాహనంలోని ముగ్గురు వ్యక్తులు చివరి క్షణంలో బయట పడి ప్రాణాలు దక్కించుకున్నారు. క్షణాల వ్యవధిలోనే ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలో కారు కొట్టుకుపోయింది. క్షణాల్లో జరిగిపోయిన ఈ ఘటనను మరో గట్టుపై ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశాడు.
http://www.teluguone.com/news/content/car-washed-away-in-flood-water-25-140091.html





