ఎస్ఐఆర్ భయం.. డ్రైవర్ ఆత్మహత్య
Publish Date:Jun 29, 2026
Advertisement
తెలంగాణలో ఎస్‌ఐఆర్ భయం పీక్స్ కు చేరిందని చెప్పాలి. ఈ భయంలో హైదరాబాద్ లో ఒకరి ఆత్మహత్యకు కారణమైంది. సర్ నివేదికలు, తనిఖీలుఈ నివేదికల భయం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ప్రభుత్వ అధికారిక రికార్డులు లేదా ఎస్‌ఐఆర్ జాబితాలో తన పేరు నమోదు కాలేదన్న బాధతో, భయంతో, మనస్తాపంతో ఓ కారు డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ బోరబండ పరిధిలోని భరత్‌నగర్ లో జరిగింది. బోరబండ భరత్‌నగర్ ప్రాంతానికి చెందిన షేక్ ముజీబుర్ రహ్మాన్ వృత్తిరీత్యా కారు డ్రైవర్. రోజంతా కష్టపడితేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి అతనిది. ఎంతో కష్టపడి తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ముజీబుర్ రహ్మాన్ కు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు దివ్యాంగులు. కాగా ఆ కుటుంబానికి ప్రభుత్వ ఆసరాగా నిలిచేవి. అయితే.. ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐఆర్ సర్వే, నివేదికల ప్రక్రియ ముజీబుర్ రహ్మాన్ జీవితంలో తీవ్ర ఆందోళనను నింపింది. ఈ ఎస్‌ఐఆర్ జాబితాలో తన పేరు లేదనే విషయం అతనికి తెలిసింది. తన పేరు నమోదు కాకపోవడంతో భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా వచ్చే ఎటువంటి సహాయం లేదా పెన్షన్లు, రేషన్ వంటి ప్రయోజనాలు తన ఇద్దరు దివ్యాంగులైన పిల్లలకు అందవేమోనని అతనుఆందోళనకుగురయ్యాడు. పిల్లల భవిష్యత్తు, ముఖ్యంగా ఇద్దరు దివ్యాంగుల పోషణ ఎలా అనే ఆవేదన కలిచి వేసింది. ఈ క్రమంలోనే ఇటీవల తరచుగా తన భార్య వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబం రోడ్డున పడుతుందన్న ఆందోళనకు గురయయాడు. ఆ ఆందోళనతోనే షేక్ ముజీబుర్ రహ్మాన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఇద్దరు దివ్యాంగులైన పిల్లలను, భార్యను వదిలి అతను బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ఒక చిన్న జాబితా లేదా అధికారిక ప్రక్రియ ఒక ప్రాణాన్ని బలితీసుకోవడంపై భరత్‌నగర్ వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
http://www.teluguone.com/news/content/car-driver-commits-suicide-36-224501.html





