ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి
Publish Date:Jun 13, 2026
Advertisement
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో శనివారం (జూన్ 13) రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెడుతున్న ఓ కారు అదుపుతప్పి నేరుగా రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లడంతో.. ఆ ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు మరణించారు. ప్రమాదం తీవ్రత ఎంతగా ఉందంటే.. కారు ఇంటి గోడను ధ్వంసం చేసి మరీ లోపలికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న వారు కారు కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. భారీ శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి వచ్చి చూసేసరికే ఇంట్లో ఉన్న ముగ్గురూ మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ధ్వంసమైన ఇంటి శిథిలాల మధ్య చిక్కుకున్న కారును క్రేన్ సహాయంతో బయటకు తీసే పనులు కొనసాగుతున్నాయి. మృతుల వివరాలు, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడికాలేదు.నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘోర ప్రమాదం దుద్దెడ గ్రామంలో విషాద ఛాయలు నింపింది. పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/car-crashes-into-house-36-222880.html





