బర్త్ డే పేరుతో పోకిరీల హల్‌చల్

Publish Date:Jun 14, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళల్లో కొందరు యువకులు బర్త్‌డే వేడుకల పేరుతో హద్దులు మీరుతున్న ఘటనలు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అర్థరాత్రి వేళల్లో కాలనీల్లో గుమిగూడి టపాకులు కాలుస్తూ, పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ, కేకలు వేస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బర్త్‌డే సెలబ్రేషన్స్ పేరుతో రోడ్లపై గుంపులుగా చేరుతున్న యువకులు అతివేగంగా బైక్‌లు, కార్లు నడుపుతూ ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో అర్ధరాత్రి నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడటమే కాకుండా, వృద్ధులు, చిన్నారులు భయభ్రాంతు లకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. టపాకుల శబ్దాలు, బైక్‌ల రేసింగ్, పెద్దగా అరుపులు, కేకలతో కాలనీల ప్రశాంతతకు భంగం కలుగుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపిం చడం లేదని వాపోతు న్నారు. అర్ధరాత్రి వేళల్లో జరుగుతున్న ఈ పోకిరీ చేష్టలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాలనీల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు రాత్రి పూట పోలీసు పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పుట్టిన రోజు సంబరాలు ఆనందంగా జరుపుకోవాలి.. కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించేలా కాదు" అని కాలనీవాసులు అభిప్రాయపడుతున్నారు.

  


 

By
en-us Political News

  
ఇరాన్ అణు పరిమితులపై రాబోయే 60 రోజుల్లో చర్చలు జరపాలని అమెరికా భావిస్తోంది. అయితే, ఇరాన్ అణు సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయడంలో ఈ ఒప్పందం విఫలమైందని నెతన్యాహు అన్నారు.
యూకేలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధిస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖకు సంబంధించిన వాహన్, సారథి సాఫ్ట్‌వేర్ సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు
కేంద్రంలో ఏపీకి ప్రాధాన్యత పెంచేలా ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణను కించపరిస్తే సహించం టీపీసీసీ చీఫ్ హెచ్చరిక..
తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ అంశం తీవ్ర దుమారం రేపుతోంది.
విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసిన చెంగల్పట్టు కోర్టు..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్ టెక్నాలజీ సంచలనాలు సృష్టిస్తోంది. అమెరికా రెడీమేడ్ డ్రోన్లు ఎందుకు ఫెయిల్ అవుతాయో, ఉక్రెయిన్ 250 కిలోమీటర్ల రేంజ్ ఏఐ డ్రోన్లతో రష్యాను ఎలా దెబ్బతీస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
అనారోగ్యం లేదా ప్రమాదం వల్ల ఉద్యోగానికి వెళ్లలేనప్పుడు మీ నెలవారీ ఆదాయాన్ని కాపాడే ఆదాయ రక్షణ బీమా (Income Protection Insurance) గురించిన టాప్ 5 అపోహలను మరియు వాటి వెనుక ఉన్న అసలు నిజాలను నిపుణుల సర్వే గణాంకాలతో సహా ఇక్కడ తెలుసుకోండి.
అంతర్జాతీయ శాంతి ఒప్పందంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ లాభాల పంట పండింది. సెన్సెక్స్ 1,100 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24,000 మార్కు వైపు దూసుకెళ్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఇ లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఈక్వెడార్‌పై ఐవరీ కోస్ట్ 1-0తో ఘన విజయం సాధించింది. 90వ నిమిషంలో అమాద్ డియాల్లో కొట్టిన సంచలన గోల్ ఈక్వెడార్ 19 మ్యాచ్‌ల అజేయ రికార్డును ముగించింది. మ్యాచ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును బద్దలు కొట్టి, టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ రికార్డు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.