కుమార్తె ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళిన కుటుంబానికి అనుకొని ప్రమాదం ఎదురైంది. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి, ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ సుచి యాష్కీ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగన యాష్కీని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎమ్‌డీ కోర్సులో చేర్పించి, అక్కడి నుంచి న్యూయార్క్‌కు తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. వర్షం కారణంగా డాక్టర్ సుజి ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో డాక్టర్ సుచి యాష్కీ కి తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదంలో ఆమెకు పక్కటెముకలు విరిగినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా, చికిత్స పొందుతూ కోలుకుంటు న్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కుమార్తెను ఎమ్‌డీ కోర్సులో చేర్పించేందుకు వెళ్లిన సందర్భంగా లగేజీ ఎక్కువగా ఉండటంతో మధుయాష్కీ గౌడ్, డాక్టర్ సుచి యాష్కీ వేర్వేరు కార్లలో ప్రయాణించినట్లు తెలిసింది.
ఈ క్రమంలో డాక్టర్ సుచి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.ప్రమాదం జరిగిన సమయంలో మధు యాష్కీ మరో వాహనంలో ఉన్నారు. ఇటీవల డాక్టర్ గగన యాష్కీ న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మధుయాష్కీ గౌడ్ అమెరికా వెళ్లారు. కాగా, ఆయన భారత్‌కు తిరిగి రావాల్సి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేసింది. అయితే డాక్టర్ సుచి యాష్కీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/car-accident-in-america-36-221723.html
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్‌గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.