Publish Date:Dec 21, 2019
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే జీఎస్‌రావు కమిటీ తుది నివేదికను సమర్పించింది. అయితే, అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏదైతే చెప్పారో .... సేమ్ టు సేమ్... దాన్నే నిపుణుల కమిటీ కూడా సిఫార్సు చేసింది. అయితే, సీఎం జగన్.... సింపుల్ స్టేట్ మెంట్ ఇస్తే.... నిపుణుల కమిటీ మాత్రం డిటైల్ట్‌గా ప్రకటన చేసింది. అంటే... విశాఖలో ఏమేమీ ఉంటాయో... అమరావతిలో ఏముంటాయో... అలాగే, కర్నూలులో ఏమేమీ ఏర్పాటు చేయాలో క్లారిటీగా చెప్పింది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పినట్లుగానే... కర్నూలులో హైకోర్టు... అనుబంధ కోర్టులు ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. సీఎం స్టేట్‌మెంట్‌కు అదనంగా కర్నూలులో అసెంబ్లీ వింటర్ సెషన్స్‌ను నిర్వహించాలని సూచించింది. అదేవిధంగా అమరావతిలో.... అసెంబ్లీ, రాజ్‌భవన్‌తోపాటు మినిస్టర్స్ క్వార్టర్స్, వివిధ శాఖల కార్యాలయాలు, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఇక, విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్ కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటుతోపాటు అసెంబ్లీ సమ్మర్ సెషన్స్ నిర్వహించాలని సూచించింది.
రాజధానిపై గతంలో ఏర్పాటైన శివరామకృష్ణ కమిటీ రిపోర్టును కూడా పరిశీలించామన్న జీఎస్‌రావు... ఏపీలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని... మరికొన్ని వెనుకబడి ఉన్నాయన్నారు. పట్టణీకరణ అంతా మధ్య, ఉత్తర కోస్తాలోనే కేంద్రీకృతమై ఉందని... అలాగే, దక్షిణ కోస్తా, రాయలసీమలో పట్టణీకరణ చాలా తక్కువగా ఉందని... అందుకే తాము అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరి అంటూ సూచించామన్నారు. ముఖ్యంగా రాయలసీమలో నాలుగు జిల్లాలూ వెనుకబడే ఉన్నాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీని నాలుగు ప్రాంతాలుగా విభజించి ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. శ్రీకాకుళం, విజయనగరాన్ని ఒక మండలిగా.... కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు రెండో మండలిగా... ప్రకాశం, నెల్లూరును మూడో మండలిగా.... రాయలసీమను నాలుగో మండలిగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని చెప్పినట్లు కమిటీ సభ‌్యులు తెలిపారు. అలాగే, ఎలాంటి ముప్పులేని ప్రాంతాల్లోనే అభివృద్ధి జరగాలని సూచించినట్లు జీఎస్‌రావు తెలిపారు. మొత్తంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అనుసరించాల్సిన విధానాలను ప్రభుత్వానికి సిఫార్సు చేశామని అన్నారు.
రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ తుది నివేదిక సమర్పించడంతో ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. డిసెంబర్ 27న సమావేశంకానున్న మంత్రివర్గం.... జీఎస్‌రావు కమిటీ నివేదికపై చర్చించనుంది. అయితే, అసెంబ్లీ వేదికగా, ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ సీఎం జగన్ స్టేట్‌మెంట్‌కు దగ్గరగా... నిపుణుల కమిటీ తుది నివేదిక ఉండటంతో... ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/capital-city-experts-committee-member-meets-ys-jagan-39-92419.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.