‘ఉచితాలు’ కొనసాగించలేక దైన్యం- ‘ముందస్తు’తో గట్టెక్కాలని వైసీపీ ఆత్రం

Publish Date:Apr 26, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ముందస్తుకు వెళ్లాలన్న యోచనలో ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అన్ని వర్గాలలో నెలకొన్న అసంతృప్తిని పరిగణనలోనికి తీసుకుని...గట్టెక్కాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే శరణ్యమన్న నిర్ణయానికి వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో అన్ని వర్గాలలో జగన్ సర్కార్ పట్ల ఏదో ఒక స్థాయిలో అసంతృప్తి వ్యక్తమౌతున్నది. అయితే రానున్న రోజులలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్ని ఇబ్బందులున్నా ‘ఉచిత’ పథకాలను కొనసాగిస్తున్నారు. అయితే రానున్న రోజులలో వీటిని కొనసాగించే అవకాశం ఏ మాత్రమూ లేదని అంటున్నారు. అదే కనుక జరిగితే ప్రభుత్వ ప్రతిష్ట మరింత మసకబారడం ఖాయమన్న భావన వైసీపీలోనే వ్యక్త మౌతున్నది. అందుకే ఈ పథకాలు కొనసాగించలేని పరిస్థితి వచ్చే లోగానే...అంటే ఈ పథకాలు కొనసాగుతుండగానే ఎన్నికలకు వెళ్లి గట్టేక్కాలని జగన్ భావిస్తున్నారు. పథకాలు కొనసాగుతుండగానే ఎన్నికలకు వెళ్లడం ద్వారా సంక్షేమానికి చాంపియన్ గా నిలిచానని ప్రచారం చేసుకోవడంతో పాటు మరోసారి అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు అమలు చేస్తామన్న వాగ్దానాలు ఇచ్చే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అలా కాకుండా పూర్తి కాలం అధికారంలో ఉండి...గడువు ప్రకారమే ఎన్నికలకు వెళ్లినట్లైతే...ఆప్పటి వరకూ పథకాలు కొనసాగించే అవకాశం ఉండదనీ, అందు వల్ల వాగ్దానాలు అమలు పరచడంలో విఫలమైన ప్రభుత్వంగా ప్రజల ముందకు వెళ్లాల్సి వస్తుందని, అదే జరిగితే విఫల నేతగా జనం ముందుకు వెళ్లాల్సి వస్తుందనీ, అది ప్రతికూల ఫలితాన్ని ఇస్తుందని జగన్ భావిస్తున్నట్లు చెప్పారు. ఆ కారణంతోనే  ముందస్తుకు సన్నద్ధమవ్వాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు జగన్ దిశా నిర్దేశం చేసినట్లు చెబుతున్నారు.  మొత్తం మీద మరో రెండేళ్లు గడువు ఉన్నప్పటికీ జగన్ ముందస్తుకే మొగ్గు చూపడానికి కారణం ఉచిత పథకాలను కొనసాగించలేని దైన్యమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
తెలంగాణలో రూ.96 కోట్ల ప్రభుత్వ నిధులకు గండి.!
ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసి బస్సులో చిన్నపాటి చిల్లర గొడవ కాస్తా ఊహించని సంఘటనకు దారితీసింది.
గంటకు 140 కి.మీ వేగంతో పెనుగాలులు..అప్రమత్తమైన యంత్రాంగం.!
ఒకవైపు ధరల మంట.. మరోవైపు కృత్రిమ కొరతలు..!
హైదరాబాద్ మహానగరంలో మరోసారి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.