కెనడా ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు.. భారతీయులకు అక్కడ శాశ్వత నివాసం ఇక కలేనా?

Publish Date:Apr 22, 2026

Advertisement

కెనడా ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్  చట్టాలు..  అక్కడి విదేశీయులకు.. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కెనడా పార్లమెంటులో ఆమోదం పొందిన  బిల్ C-12  ద్వారా పౌరసత్వ, నివాస నిబంధనలను ట్రూడో సర్కారు సమూలంగా మార్చేసింది. ఈ కొత్త నిబంధనల వల్ల సరైన అర్హతలు లేని వారు, నిబంధనలు ఉల్లంఘించిన వారు   దేశ బహిష్కరణకు  గురయ్యే ప్రమాదం ఉంది. అక్కడ నివసిస్తున్న దాదాపు 30 వేల మందికి పైగా ఇండియన్స్   ఈ చట్టం పరిధిలోకి రానున్నట్లు అంచనా.

గత కొన్ని దశాబ్దాలుగా కెనడా విదేశీయులకు స్వర్గధామంగా నిలిచింది. అయితే, ఇటీవల కాలంలో పెరుగుతున్న జనాభా, గృహ నిర్మాణ రంగంలో సంక్షోభం,  మౌలిక సదుపాయాలపై పడుతున్న ఒత్తిడి దృష్ట్యా కెనడా తన ఇమ్మిగ్రేషన్ విధానాన్ని కఠినతరం చేస్తోంది. తాజాగా తీసుకువచ్చిన బిల్ ప్రధానంగా కెనడా పౌరసత్వం పొందే ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు.. అనర్హులను ఏరివేసేందుకు ఉద్దేశించినదని చెబుతున్నారు.   ఈ చట్టం ప్రకారం..  తప్పుడు సమాచారంతో వీసాలు పొందిన వారు, అలాగే.. గడువు ముగిసినా అక్కడే ఉంటున్న వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశాలు దఖలుపడతాయి. 

ఈ పరిణామం కెనడాలో స్థిరపడాలని కలలు కంటున్న లక్షలాది మంది ఇండియన్స్ పై మరీ ముఖ్యంగా పంజాబ్, హర్యానా,  తెలుగు రాష్ట్రాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే స్టడీ పర్మిట్లపై ఆంక్షలు విధించిన కెనడా..  ఇప్పుడు శాశ్వత నివాస హోదా కల్పించే విషయంలో కూడా కోత విధించాలని నిర్ణయించింది. బిల్ సి 12 అమలుతో పౌరసత్వ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా, చిన్నపాటి నిబంధనల ఉల్లంఘనలు జరిగినా వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితులకు దారితీస్తుంది.

ముఖ్యంగా రాజకీయ ఆశ్రయం కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారిపై ఈ చట్టం ప్రభావం తీవ్రంగా ఉంది. కెనడాకు వచ్చిన ఏడాది లోపు ఆశ్రయం కోరని పక్షంలో వారి దరఖాస్తులను తిరస్కరించే వెసులుబాటును ఈ చట్టం కల్పించింది.   నిజానికి, కెనడాలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, నిరుద్యోగ సమస్య  ఈ కఠిన నిర్ణయాలకు కారణమని తెలుస్తోంది. స్థానిక కెనడియన్లలో పెరుగుతున్న అసహనాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వలసదారుల సంఖ్యను తగ్గించాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే తాత్కాలిక నివాసితుల సంఖ్యను భారీగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.  

మరోవైపు, ఈ చట్టం పట్ల మానవ హక్కుల సంఘాలు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా కెనడా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిన వలసదారులను అకస్మాత్తుగా వెనక్కి పంపడం వల్ల కార్మికుల కొరత ఏర్పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అక్కడి హోటల్ మేనేజ్‌మెంట్,అగ్రికల్చర్ రంగాల్లో భారతీయుల పాత్ర కీలకం. అయితే..  జాతీయ భద్రత మరియు ఆర్థిక స్థిరత్వం దృష్ట్యా ఈ మార్పులు తప్పవని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది.

భారతీయ విద్యార్థుల విషయానికి వస్తే, చాలా మంది విద్యార్థులు భారీగా అప్పులు చేసి కెనడాకు వెళ్తుంటారు. అక్కడ చదువు పూర్తి చేసిన తర్వాత శాస్వత నివాసం పొంది స్థిరపడాలనేది వారి ప్రధాన లక్ష్యం. కానీ..  మారుతున్న నిబంధనలు వారి భవితపై ఆందోళనకు కారణమౌతున్నాయి.   బిల్ సి 12ను కఠినంగా అమలు చేస్తే.. వేలాది మంది భారతీయులు స్వదేశానికి తిరిగి రాక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి.  

By
en-us Political News

  
పెళ్లయిన కేవలం రెండు వారాల్లోనే అమెరికాలోని మాసాచుసెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ జాబీర్ హుస్సేన్ నిద్రలోనే కన్నుమూశారు. ఉదయం తల్లితో మాట్లాడిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలు, కుటుంబ సభ్యుల ఆవేదన మరియు పార్థివదేహం రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పూర్తి కథనం.
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.