మూడూ, నాలుగూ లాభంలేదన్న పీకే సొంత పార్టీతో రెండు సాధిస్తారా?

Publish Date:May 2, 2022

Advertisement

దేశంలో అత్యంత సక్సెస్ ఫుల్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తేశాడు. దేశంలో బీజేపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యమని ప్రకటించి ఆ దిశగా వివిధ ప్రయత్నాలు చేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు స్వయంగా తానే ఓ రాజకీయ పార్టీని స్థాపించేశారు.

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి, ఏపీలో జగన్ కు, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కు ఎన్నికల వ్యూహకర్తగా సేవలందించారు, అందిస్తున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ కు కూడా ఎన్నికల వ్యూహాలను రచించేందుకు ముందుకు వచ్చారు. ఒక దశలో ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడం దాదాఫు ఖరారేనని కూడా అంతా భావించారు. చివరకు సోనియా ఆహ్వానించినా కూడా కాంగ్రెస్ లో చేరడానికి నిరాకరించారు. 

తొలుత ఆయన తన స్వంత రాష్ట్రం బీహార్ లో జేడీయూలో చేరారు. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ విజయం సాధించడం వెనుక పీకే వ్యూహాలు ఉన్నాయన్నది జగద్వితితం. అయితే ఆ తరువాత  నితీష్ ఎన్డీయే పంచన చేరడంతో జేడీయూ నుంచి బయటకు వచ్చేసి, తనకు అచ్చొచ్చిన ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగారు. వచ్చే ఎన్నికలలో బీజేపీకి అధికారం అందకుండా చేయాలంటే దేశంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలన్న ప్రతిపాదనతో బీజేపీయేతర పార్టీలన్నిటితో మంతనాలు జరిపారు.  మూడో ఫ్రంటూ, నాలుగో ఫ్రంట్ లతో లాభం లేదనీ, కాంగ్రెస్ సహా బీజేపీయేతర శక్తులన్నీ కలిస్తేనే జాతీయ స్థాయిలో కమల నాథులకు కాషాయం రుచి చూపించే అవకాశం ఉంటుందనీ, అందుకే రెండో ఫ్రంటే సరైనా మార్గమనీ వాదించిన పీకే చివరికి ఎవరూ కలిసి రాక సొంత కుంపటి వైపు మొగ్గు చూపారు. 

సొంత పార్టీతోనైనా బీజేపీయేతర శక్తులన్నిటినీ కూడగట్టి రెండు సాధిస్తారా?  అలా సాధించేందుకు పీకేతో కలిసి వచ్చే పార్టీ లేమిటి? మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రేలు కలిసి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే బీహార్ నుంచి ఆర్జేడీ కూడా పీకే ప్రతిపాదించే రెండో ఫ్రంట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఒకింత అగమ్య గోచరంగానే ఉంది. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలలోనూ కూడా అధికార పార్టీలకు పీకేయే ఎన్నికల వ్యూహకర్త. మరి ఈ రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలకు పీకే కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు అంగీకరింప చేయగలుగుతారా? ఒక వేళ అది సాధ్యం కాకపోతే..వాటికి ఎన్నికల వ్యూహాలను అందించడం మానేస్తారా? ముఖ్యంగా తెలంగాణలో ఆయన కార్యాచరణ ఎలా ఉంటుందన్నది తేలాల్సి ఉంది. బీజేపీ బీ టీమ్ గా ముద్ర పడ్డ తెరాస పీకే వ్యూహాల కోసం కాంగ్రెస్ తో చేతులు కలుపుతుందా? ఆ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. మొత్తం మీద పీకే రాజకీయ పార్టీ దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మారుస్తుందో చూడాల్సి ఉంది. ఇంత కాలం వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన పీకే.. సొంత పార్టీ కోసం ఎటువంటి వ్యూహాలు రచించుకుంటారో చూడాల్సి ఉంది. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.