ప్రచారం, పాలన బోత్ ఆర్ నాట్ సేమ్.. విజయ్‌కు స్టాలిన్ ఉపదేశాలు
Publish Date:May 11, 2026
Advertisement
తమిళనాడు సీఎం విజయ్‌పై మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ మొదటి విమర్శ సంధించారు. విజయ్ పాలనను ఆరు నెలల వరకూ చూస్తామనీ.. ఆ తర్వాతే మాట్లాడ్తామని స్టాలిన్ ఇప్పటికే ప్రకటించిన స్టాలిన్.. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విజయ్ మాట్లాడుతూ తమ ముందు ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిందని , లోతుపాతులు తెలుసుకోవాల్సి వుందని అన్నారు. ఆచరణ సాధ్యం కాని మాటలు మాట్లాడనని విజయ్ అన్నారు. తానెవరినీ మోసం చేయనని కూడా చెప్పారు. దీనిపై స్టాలిన్ స్పందించారు. తన ప్రభుత్వ అప్పులపై విజయ్ విమర్శలు గుప్పించి, హామీల అమలు నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు విజయ్ ఆరోపణలపై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోసపూరిత ప్రకటనలతో ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దని హితవు చెబుతూనే.. ఉచిత విద్యుత్, మహిళల భద్రత, మాదక ద్రవ్యాల రవాణా అడ్డుకునేందుకు మొదటి సంతకం చేసిన విజయ్‌ని స్టాలిన్ అభినందించారు. పది లక్షల కోట్లు అప్పు చేసి, ఖజానాను ఖాళీ చేశారన్న విజయ్ విమర్శల్ని స్టాలిన్ తీవ్ర తప్పు పట్టారు. ఫిబ్రవరి బడ్జెట్‌లోనే అప్పులు, అలాగే ఆర్థిక స్థితి గురించి స్పష్టంగా చెప్పామని గుర్తు చేసిన స్టాలిన్.. ఓటేసిన ప్రజలను తప్పుదోవ పట్టించేలా , ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నించవద్దని విజయ్‌కి హితవు చెప్పారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, సంక్షేమ పథకాల్ని అమలు చేశామని గుర్తు చేశారు. ప్రచారం, పాలన ఒక్కటి కాదని విజయ్‌కి స్టాలిన్ ఉపదేశాలు చేశారు. అలాగే హామీలు నెరవేర్చడంలో సవాళ్లు ఏమిటో త్వరలో అర్థమవుతాయని సుతిమెత్తగా హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/campaigning-and-governance-25-219406.html





