ప్రచారం, పాలన బోత్ ఆర్ నాట్ సేమ్.. విజయ్‌కు స్టాలిన్ ఉపదేశాలు

Publish Date:May 11, 2026

Advertisement

త‌మిళ‌నాడు సీఎం విజ‌య్‌పై మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ మొదటి విమర్శ సంధించారు. విజ‌య్ పాల‌న‌ను ఆరు నెల‌ల వ‌ర‌కూ చూస్తామ‌నీ..  ఆ త‌ర్వాతే మాట్లాడ్తామ‌ని స్టాలిన్ ఇప్ప‌టికే  ప్రకటించిన స్టాలిన్..  సీఎంగా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత విజ‌య్ మాట్లాడుతూ త‌మ ముందు ప్ర‌భుత్వం రూ.10 ల‌క్ష‌ల కోట్లు అప్పు చేసి వెళ్లింద‌ని , లోతుపాతులు తెలుసుకోవాల్సి వుంద‌ని అన్నారు. ఆచ‌ర‌ణ సాధ్యం కాని మాట‌లు మాట్లాడ‌న‌ని విజ‌య్ అన్నారు. తానెవ‌రినీ మోసం చేయ‌న‌ని కూడా చెప్పారు.  దీనిపై స్టాలిన్ స్పందించారు.  త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని  విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో..  మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే..  ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.  

ప‌ది ల‌క్ష‌ల కోట్లు అప్పు చేసి, ఖ‌జానాను ఖాళీ చేశార‌న్న విజ‌య్ విమ‌ర్శ‌ల్ని స్టాలిన్ తీవ్ర త‌ప్పు ప‌ట్టారు. ఫిబ్రవరి బడ్జెట్‌లోనే అప్పులు, అలాగే ఆర్థిక స్థితి గురించి స్ప‌ష్టంగా చెప్పామని గుర్తు చేసిన స్టాలిన్.. ఓటేసిన ప్రజలను తప్పుదోవ పట్టించేలా , ప్ర‌జ‌ల్ని మోసం చేసేందుకు ప్రయత్నించవద్దని విజ‌య్‌కి  హిత‌వు చెప్పారు. కోవిడ్ లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొని, సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేశామ‌ని గుర్తు చేశారు. ప్ర‌చారం, పాల‌న ఒక్క‌టి కాద‌ని విజ‌య్‌కి స్టాలిన్ ఉపదేశాలు చేశారు. అలాగే హామీలు నెరవేర్చడంలో సవాళ్లు ఏమిటో త్వరలో అర్థమవుతాయని  సుతిమెత్తగా హెచ్చరించారు. 

By
en-us Political News

  
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి వైసీపీ 62 పిటిషన్లు వేసింది.!
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది.
దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో వైఎస్సార్‌సీపీకి దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
ప్రేమలో పడితే చాలా మంది పిచ్చి పనుల చేస్తుంటారు. నా కోసం ఏం చేస్తావని ప్రియురాలు అడిగితే.. ప్రాణమైనా ఇస్తానని లేదా ఆకాశంలోని చుక్కలైనా తెచ్చిస్తానని సినిమా డైలాగులు చెబుతుంటారు.
చిన్న రీఫండ్ కోసం ప్రయత్నించింది.. చివరకు భారీ మొత్తాన్ని పోగొట్టుకుంది.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.