మాస్క్ పెట్టుకుంటే ఫైన్! ఎక్కడో తెలుసా...
Publish Date:Jun 7, 2021
Advertisement
కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అల్లాడిపోయింది. లక్షలాది మంది చనిపోయారు. కోట్లాది మంది వైరస్ భారీన పడ్డారు. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్డడంతో దేశాలు కోలుకున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాయి. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ మెజార్టీ జనాలకు పూర్తి చేసిన దేశాలు క్రమంగా కరోనా ఆంక్షలు సడలిస్తున్నాయి. అయితే మాస్క్ మాత్రం తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే కరోనా తీవ్రత తగ్గినా.. మాస్క్ ధరించని వారికి కొన్ని చోట్ల భారీ మొత్తంలో అధికారులు జరిమానా విధిస్తున్నారు.కాని అమెరికాలోని ఒక ప్రాంతంలో మాత్రం మాస్కు పెట్టుకుంటే ఫైన్ విధిస్తున్నారు . అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఫిడిల్‌హెడ్స్ కేఫ్ లో పరిస్థితికి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ మాస్క్ ధరిస్తే.. ఫైన్ విధిస్తున్నారు.ఫిడిల్‌హెడ్స్ కేఫ్ యజమాని అక్కడికొచ్చిన కస్టమర్లుకు ఫైన్ వేస్తున్నాడు. కేఫ్‌కు వచ్చిన కస్టమర్లకు ఈ విషయాన్ని ముందే చెబుతున్నాడు కూడా. కేఫ్‌లోని గోడలపై పెద్దపెద్ద అక్షరాలతో ‘ఎవరైనా ఆర్డర్ చేస్తేటపుడు మాస్క్ ధరిస్తే 5 డాలర్లు.. టీకా తీసుకున్న విషయాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటే మరో ఐదు డాలర్ల ఫైన్ విధించబడును’ అని బోర్డు రాసి పెట్టాడు. కేఫ్ యజమాని తీరుపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత అసలు సంగతి తెలుసుకుని షాకయ్యారు. కేఫ్ యజమాని స్వచ్ఛంద సంస్థ కోసం ఈ రూల్ పెట్టాడు. మాస్క్ అందరూ ధరిస్తారు కాబట్టి.. స్వచ్ఛంద సంస్థకు ఎక్కువ నిధులు వస్తాయనే ఉద్దేశ్యంతో ఇలా ఏర్పాటు చేశారు. ఈ ఫైన్ సంగతి తెలుసుకుని కస్టమర్లు కూడా యజమానికి మద్దతుగా నిలుస్తున్నారు. మాస్క్ ధరించి కేఫ్ కు వెళ్లి పోటీపడి మరీ కస్టమర్లు ఫైన్లు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది.
http://www.teluguone.com/news/content/california-cafe-owner-charges-customers-fee-for-wearing-mask-39-117084.html





