Publish Date:Oct 30, 2022
సాయంత్రం సరదాగా గడిపేం దు కు కేబుల్ బ్రిడ్జ్ మీదకు వెళ్లి గడ పడం ఎవరికయినా ఇష్టమే. కానీ ఈ ఆదివారం ఇలా ఘోర ప్రమాదం సంభవిస్తుందని ఎవ్వ రూ ఊహించ లేదు. గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బి జిల్లాలో మచ్చూ నదిపై కేబిల్ బ్రిడ్జీ కుప్పకూలింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమా దంలో 32మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమ యంలో బ్రిడ్జిపై ఉన్న సందర్శ కులంతా నదిలో పడి పోయారు. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై 500 మందివరకు ఉన్నారని, వందమంది వరకు నీటిలో చిక్కుకున్నారని తెలుస్తోంది.
స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చర్యలు కొనసాగుతున్నాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. కాగా కొన్నేళ్లక్రితమే ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఇటివలే పున రుద్ధరణ తర్వాత ఐదురోజుల క్రితమే ఈ బ్రిడ్జీని పున:ప్రారంభించారు. నదిలో పడిపోయినవారి కోసం స్థానికుల సాయంతో అధికారులు గాలిస్తున్నారు. గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘ్వీ, ఆరోగ్య శాఖ మంత్రి రిషికేష్ పటేల్ ఘటనా స్థలానికి బయలు దేరారు. రెండు బృందాల నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫోర్స్ హూటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరాయి.
మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో గాయపడినవారికి రూ.50 వేల సాయం ప్రకటించింది. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మూడు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cable-bridge-collapsed-in-gujarat-25-146281.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.