కళ్ల ముందు హత్య జరిగితే పట్టించుకోం. ఎందుకంటే!

Publish Date:May 4, 2017

Advertisement

1964 మార్చి 13: న్యూయార్కులో Catherine Genovese అనే 28 ఏళ్ల అమ్మాయి రోడ్డు దాటుకుని తన ఇంట్లోకి వెళ్లబోతోంది. ఇంతలో ఓ సీరియల్‌ కిల్లర్ ఆమె మీద దాడి చేశాడు. దారినపోయేవారు చూస్తుండగా Catherineని దారుణంగా హతమార్చాడు. తనని రక్షించమంటూ కేథరీన్‌ ఎంత అరిచినా, ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అక్కడ దాడి జరుగుతోందన్న విషయం పోలీసులకు చెప్పేందుకు కూడా ఎవరూ ప్రయత్నించలేదు. దీంతో Bystander Effect అనే తత్వం గురించి చర్చ మొదలైంది.


ఏమిటీ ఎఫెక్ట్‌?
అమెరికా పోలీసు శాఖ ప్రకారం 70 శాతం దాడులు నలుగురూ చూస్తుండగానే జరుగుతాయి. 52 శాతం దొంగతనాలు జరిగేటప్పుడు కూడా చుట్టుపక్కలవారు చూసీ చూడనట్లుగా సాగిపోతుంటారు. ఇలా తమ పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకపోవడాన్ని Bystander Effect అంటారు. గొడవలోకి దిగితే తనకి ఏదన్నా జరుగుతుందనే సహజమైన భయం ఎలాగూ ఉంటుంది అంతకు మించిన కారణాలు కూడా ఉన్నాయంటున్నారు సైకాలజిస్టులు.

 


- నలుగురూ ఉండటం వల్ల... నేరాన్ని అడ్డుకునే బాధ్యత ఎవరో ఒకరు తీసుకుంటారులే అన్న నిర్లిప్తత ఏర్పడుతుంది. దీనిని Diffusion of responsibility అంటారు.


- సంఘటనాస్థలంలో ఉన్నవారంతా ఏం చేయకపోవడంతో... అలా ఏం చేయకుండా ఉండటమే మంచిదేమో అన్న అపోహ ఏర్పడుతుంది.


- హత్య, దాడిలాంటి సంఘటనలకి మనం సిద్ధంగా ఉండం. దాంతో అలాంటివి చూసినప్పుడు మెదడు అయోమయానికి లోనవుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతోందో, దానికి ఎలా ప్రతిస్పందించాలో తెలియని సందిగ్థంలో గుడ్లప్పగించి చూస్తుండిపోతాము.


ఏం చేయాలి?
Bystander Effect వినడానికి బాగానే ఉంది. కానీ మనం కూడా దానికి లొంగిపోతే ఎలా! అందుకని కళ్ల ముందు ఏదన్నా ఘోరం జరుగుతున్నప్పుడు ఈ Bystander Effectని అధిగమించేందుకు కొన్ని ఉపాయాలు కూడా సూచిస్తున్నారు.

- అయోమయంగా చూస్తూ ఉండిపోకుండా... అక్కడేం జరుగుతుందో అంచనా వేసే ప్రయత్నం చేయాలి.
- మీ వంతుగా అందులో పాలుపంచుకునే అవకాశం ఏమేరకు ఉందో ఆలోచించాలి.
- దాడి చేస్తున్న వ్యక్తిని మాటల్లోకి దింపితే హింసకి పాల్పడే అవకాశం కూడా తగ్గుతుంది.
- ఈ సందర్భంలో చుట్టూ మూగేవారిని కలిసికట్టుగా ఉసిగొల్పే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది.
- ఇదివరకు నేరం గురించి సమాచారం ఇచ్చేవారినీ, గాయపడిన వ్యక్తులని హాస్పిటల్‌కు తీసుకువెళ్లేవారినీ విచారణ పేరుతో తెగ వేధించేవారు. ఈ విచారణ భయంతోనే చాలామంది వెనకడుగు వేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు చట్టాలు మారాయి. సాయపడేవారికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి తర్వాత ఏం జరుగుతుందో అన్న భయం వదిలి ప్రమాదంలో ఉన్నవాడికి సాయపడే ప్రయత్నం చేయాలి.


అన్నింటికీ మించి, అసలు ఈ Bystander Effect గురించి అవగాహన ఉంటే చాలు... మనం దానికి లొంగకుండా ఉంటామంటున్నారు సైకాలజిస్టులు.

 

- నిర్జర.

By
en-us Political News

  
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.