తెరాసలో ఉప ఎన్నికల భయం

Publish Date:Jul 30, 2022

Advertisement

మలివిడత తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట సమితి (తెరాస) తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పుడంటే అప్పుడు రాజీనామాలు చేశారు, పుష్కర కాలానికి పైగా సాగిన తెలంగాణ ఉప ఎన్నికలకు పోవడం ఒక నిరంతర క్రతువుగా, ఉద్యమంలో భాగంగా, జరిగిపోయింది. పుష్కర కాలానికి పైగా తెరాస సారధ్యంలో సాగిన ఉద్యమానికి అవసరమైన ఆక్సిజన్ అందించేందుకు,సెంటిమెంట్ ను సజీంగా ఉంచేందుకు, తెరాస అధినేత కల్వకుట్ల చంద్రశేఖర రావు, ఉప ఎన్నికలను ఒక అస్త్రంగా ఉపయోగించుకున్నారు. 
నిజానికి  మాలి విడద తెలంగాణ ఉద్యమం కేసీఆర్  రాజీనామాతోనే పురుడు పోసుకుంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో పాటు, ఎమ్మెల్యే (సిద్ధిపేట), అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, పదవులకు రాజీనామా చేసిన తర్వాతనే కేసీఆర్, తెరాస జెండా ఎగరేశారు. సిద్ధిపేట ఉప ఎన్నికతోనే తెరాస రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇక ఆ తర్వాత, గెలుపు ఓటములు ఎలా ఉన్నా, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నిసార్లు రాజీనామాలు చేశారో ఎన్నిసార్లు ఉపఎన్నికలకు వెళ్ళారో చెప్పలేము. అదొక చరిత్ర. 
అయితే, ఇప్పడు అదే తెరాస ఉప ఎన్నికలు అంటే భయపడుతోందా? అప్పుదు ఉద్యమ నేతగా ప‌లుమార్లు తన‌తో పాటు టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్ళిన కేసీఆర్, ముఖ్యమంత్రిగా ఉప ఎన్నికలకు వెళ్లేందుకు భయపడుతున్నారా? అంటే, అందరి నుంచి అవుననే సమధానమే వస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉపఎన్నికలకు వెళితే ఫ‌లితం ఏ మాత్రం అటూ ఇటు అయినా,  అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌నే భ‌యం కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ నేత‌ల్ని వెంటాడుతోంది. ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత కేసీఆర్ ఉప ఎన్నికలంటే భయపడుతున్నారని, సన్నిహిత వర్గాల సమాచారంగా ప్రచారం జరుగుతోంది.   మరో వంక, దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల విజయంతో తెలంగాణపై ఆశలు పెంచుకున్న బీజేపీ, ఉప ఎన్నికలకు ఉత్సాహం చూపుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో   తెలంగాణలో కాషాయ జెండా ఎగరేసేందుకు సర్వ శక్తులు వడ్డుతున్న బీజేపీ, అసెంబ్లీ ఎన్నికలలోగా, తెరాస, కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకుని, ఉప ఎన్నికల ద్వారా రాష్ట్రంలో ప్రధాన రాజకీయ శక్తి గా ఎదుగేందుకు వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. 

నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి బీజేపీలో చేరేందుకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అయి పోయారు. మునుగోడు నియోజక వర్గంలో రాజగోపాల రెడ్డికి, పార్టీ (కాంగెస్) పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ  మంచి పట్టుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి స్థానికంగా అంతపట్టులేకున్నా, ఇతరత్రా అంగబలం, అర్థ బలం అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అన్నిటినీ మించి, రాజగోపాల రెడ్డి అన్నట్లుగా తెరాసను గద్దె దించాలనే పట్టుదల వుంది. 

మరోవంక, వరసగా రెండు తెరాస సిట్టింగు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన బీజేపీ, మునుగోడును  గెలుచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఉప ఎన్నిక‌లు అధికార తెరాసకు క‌లిసి రావ‌డం లేదు. అందుకే మునుగోడు ఉప ఎన్నిక అంటే టీఆర్ఎస్ భయపడుతోందని, అలాగే, హుజూర్ నగర్ సిటింగ్ స్థానంతో పాటు, కాంగ్రెస్ దిగ్గజం జానారెడ్డి పోటీ చేసిన నాగార్జున సాగర్ స్థానం ఉపేన్నికలోనూ ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఉప ఎన్నికకు అంత సుముఖంగా లేదని అంటున్నారు. ఉపఎన్నికల్లో ఓడి పొతే, అది కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బవుతుందిని ఆపార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. అందుకే,  కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  
అదలా ఉంటే. మునుగోడు ఉపఎన్నికలో, టీఆర్ఎస్ ఓడితే రాష్ట్రంలో అధికార మార్పిడికి కౌంట్‌డౌట్ మొదలైనట్లేనని, పరిశీలకులు అంటున్నారు.  మరో వంక బీజేపీ, మునుగోడుతో పాటుగా,మరో రెండు మూడు నియోజక వరగాలపై కన్నేసిందని, విశ్వసనీయంగా తెలుస్తోంది. నియోజకవర్గం పై పట్టున్న ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్, తెరాస సిట్టింగ్ ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకుని రాజీనామాచేయించి,జనవరిలో మూడు లేదా నాలుగుస్థానాలకు  ఒకేసారి ఉపఎన్నికలు జరిగేలా బెజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆదే నిజమైతే, ఇప్పటికే వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు రానున్న రోజులో మరింత వేడెక్కే ప్రమాదముంది, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.