Publish Date:Jan 16, 2025
ఇండియన్ స్టార్ పేస్ బౌలర్ బుమ్రా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఖండించాడు. చాంపియన్ ట్రోఫీకి ముందు తనను బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని బుమ్రా కొట్టి పారేశారు. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, యూఏఈలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా పాల్గొనడంపై సందేహాలు లేవనెత్తుతూ… అతడు ఇంటికే పరిమితం కానున్నాడంటూ బుధవారం (జనవరి 15) మీడియాలో కథనాలు వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడేది అనుమానమేనని ఆ కథనాలు పేర్కొన్నాయి.
దీనిపై స్పందించిన బుమ్రా తన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, అదంతా నిరాధార ప్రచారమని ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. అవాస్తవాలను ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరిగిన చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా అర్ధంతరంగా ఫీల్డింగ్ నుంచి వైదొలిగాడు. ఆ తరువాత జరగనున్న ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు అతనికి విశ్రాంతి ఇచ్చారు. ఈ క్రమంలో బుమ్రా గాయం నుంచి కోలుకోలేదని ఛాంపియన్స్ ట్రోఫీకీదూరమవుతాడని ప్రచారం జరిగింది.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రా ఏకంగా 32 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అలాగే బుమ్రా డిసెంబర్ 2024కి గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడా అందుకున్నాడు. డిసెంబర్ లో మొత్తం మూడు టెస్టుల్లో 14.22 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. అటు ఐసీసీ అవార్డ్స్ 2024లో ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కు కూడా నామినేట్ అయ్యాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bumra-condemn-roumers-on-his-health-25-191369.html
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.