బుగ్గన మాటలకు అర్థాలు వేరులే.. 

Publish Date:Nov 23, 2021

Advertisement

“విశాఖపట్నం రాష్ట్రంలోనే పెద్ద నగరం. అక్కడ అన్ని సదుపాయాలున్నాయి. అనుసంధానత ఉంది. ఉక్కు కర్మాగారం, తూర్పు నౌకాదళ్ కమాండ్, షిప్’యార్డ్ ... ఇంకా .. అనేక పరిశ్రమలున్నాయి.దేశంలోని అన్ని ప్రాంతాల, అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ జీవిస్తున్నారు. కొద్దిపాటి తోడ్పాటు అందిస్తే తూర్పు కోస్తాలోనే అది అతి పెద్ద నగరం అవుతుంది. ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుంది. అందుకే, అక్కడి నుంచి పరిపాలన చేపట్టాలని నిర్ణయించాము” ఇవి ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలిలో రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలికిన పలుకులు. 

అయితే, అదే సమయంలో ఆయన మరో ముచ్చట కూడ చెప్పు కొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్లనే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు అభివృద్ధిలో వెనక బడ్డాయని జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ, వికేంద్రీకరణ అవసరమని శివరామ కృష్ణన్ కమిటీ చెప్పాయని .. చెప్పుకొచ్చారు. నిజమే, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. 

అయితే ఇలా ముందు చెప్పిన దానికి ... అందుకు కొనసాగింపుగా చెప్పుకొచ్చిన ముక్తాయింపుకు మద్య ఎక్కడా పొంతన కుదరడం లేదని, అంటున్నారు. నిజానికి, ఇది ఒక్క బుగ్గన మాటల్లోనే కాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా వైసేపీ మంత్రులు, ఇతర నాయకులు అందరి మాటల్లోనూ ఈ వైరుధ్యం ఉంటుందననేది, అందరూ అనే మాట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయాన్నే తీసుకుంటే, నిన్న (సోమవారం౦) శాసన సభలో ఇదే విషయంపై మాట్లాడుతూ, హైదరబాద్’కు ధీటుగా ఎదిగే అవకాశం ఒక్క విశాఖపట్నం నగరానికి మాత్రమే ఉందని అన్నారు. మరో వంక అదే ముఖ్యమంత్రి,అదే మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్’లోనే అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్లనే, ప్రత్యేక రాష్ట్ర  ఉద్యమం సాగిందని అన్నారు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకే ఇప్పటికే అభివృద్ధి విశాఖపట్నం నగరాన్ని ఇంకా అభివృద్ధి చేద్దామని అంటున్నారు.

ఇలా ముఖ్యమంత్రి, మంత్రులు వికేంద్రీకరణ జపం చేస్తూ అందుకు విరుద్ధంగా  విశాఖ నగరాన్ని భివృద్ధి చేయాలని, విశాఖ నగరాన్ని మరో హైదరాబద్ నగరం అంతభివ్రుద్ధి చేయాలని అనడం పట్ల రాజకీయ వ్యాఖ్యాతలు,ఆర్థిక నిపుణులు ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్న తీరుగమనిస్తే, వారికి వికేంద్రీకరణ  అంటే ఏమిటో తెలియక పోవడం అయినా కావాలి ... కాదంటే వికేద్రీకరణ విషయంలో చిత్తశుద్ది లేకపోవడం అయినా కారణం కావచ్చని అంటున్నారు. 
అలాగే రాజకీయ పరిపాలన వికేంద్రీకరణ ఎలా ఉండాలి అన్నది రాజ్యాంగమే నిర్దేశించింది. కేంద్ర ప్రభుత్వం మొదలు  గ్రామపంచాయతీ వరకు వికేంద్రీకృత పరిపాలన విధానంలో చిన్న చిన్న లోపాలున్నా, పట్ల మీదనే నడుస్తోంది. అదలా ఉంటే. పరిపాలన వికేద్రీకరణ, ఆర్థిక వికేద్రీకరణ మధ్య ఉన్న సన్నని గీతను జగన్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేసపూర్వకంగా మరిచి పోవడం వల్లనే ఈ గందరగోళం ఏర్పడుతోందని నిపుణులు అంటున్నారు.  

ఒకే రాజదాని ఉన్నా, అది ఆర్థిక వికేద్రీకరణకు అడ్డం కాదు. అమరావతి ఒకటే రాజధానిగా ఉన్నా ఒక్కొక్క ప్రాంతంలో  ఆ ప్రాంతానికి అనువైన పరిశ్రమలను స్థాపించి  స్థానిక యువతకు ఉపాధి కలిపించవచ్చని, నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం మనసులో రియల్ ఎస్టేట్ కాలు కంటూ పైకి వికేద్రీకరణ జపం చేస్తోందని నిపుణులు అంటున్నారు. ఈ ధోరణి వలన అభివృద్ధి కుంటుపడడమే కాకుండా ప్రాంతీయ అసమానట్లు తలెత్తి, ప్రత్యేకవాదం, వేర్పాటు వాదం సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.