సెంట్రల్ విస్తాలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు?

Publish Date:Jan 10, 2023

Advertisement

ఫిబ్రవరి 1 నుంచి జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నూతన పార్లమెంట్ భవనంలోనే జరుగుతాయా అంటే కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఔననే అంటున్నాయి. పార్లమెంటు కొత్త భవనం రెడీ అయ్యిందని, తుదిమెరుగులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయనీ ఆ వర్గాలు చెబుతున్నాయి. సెంట్రల్ విస్తా పేరుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పార్లమెంటు కొత్త భవనంలోనే రానున్న బడ్జెట్ సమావేశాలు జరుగుతాయన్న విషయాన్ని ఇంకా అఫీషియల్ గా ప్రకటించనప్పటికీ.. ఈ సమావేశాలను కొత్త భవనంలోనే నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త బవనంలో సెంట్రల్ సెక్రటేరియెట్, ప్రధాని నివాసం, కొత్త కార్యాలయం, ఉపరాష్ట్రపతి నిలయం వంటివన్నీ ఉంటాయి. రెండేళ్ల కిందట ఈ నిర్మాణం మొదలైంది. 2020లో భూమి పూజ జరిగింది. టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ఈ నిర్మాణ పనులు చేపట్టింది. దేశ ప్రజాస్వామ్య వారసత్వాన్ని చాటేలా జరుగుతున్న ఈ భవన నిర్మాణం తుదిమెరుగులు పూర్తి చేసుకుని ఈ నెలాఖరుకు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్న పట్టుదలతో  కేందం ఉంది.  

నిజానికి గతేడాది నవంబర్ లోనే పార్లమెంట్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా పనుల్లో కాస్త జాప్యం చోటుచేసుకుంది. మొత్తం మీద వచ్చే నెలలో జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పార్లమెంటు కొత్త భవనంలో జరుగుతాయా లేదా అన్న విషయంలో ఇప్పటికింకా క్లారిటీ రాకపోయినప్పటికీ.. ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. 

By
en-us Political News

  
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.