చిదంబరం బడ్జెట్ ముఖ్యంశాలు

Publish Date:Feb 28, 2013

Advertisement

 

 

 

 

కేంద్ర వార్షిక బడ్జెట్ 2013-14ను కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటుకు సమర్పిస్తూ ఎన్నో ఆటంకాలను సమర్ధవంతంగానే ఎదుర్కొంటూ దేశ యువతకు ఆశాజనకమైన భవిష్యత్తును అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ప్రజలకు ఏం కావాలి అంటే సమాజంలో ఎదుగుదలకు అవకాశాలు, విద్య, నిపుణత, ఉపాధి అవకాశాలు. వీటి ఆవశ్యకత దేశంలో యువతకు బాగా తెలుసు, ప్రతి తల్లికీ తెలుసు. వారికి విస్తృతావకాశాలు కల్పించడం కోసమే ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాలన, విత్త యాజమాన్యం రెండింటినీ సమతౌల్యం చేసుకుంటూ 2013-14 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రూపొందించినట్టు మంత్రి చెప్పారు.

 

చిదంబరం బడ్జెట్ ముఖ్యంశాలు:

 

- ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.41,561 కోట్లు
- ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.24,598 కోట్లు
- మహిళా సంక్షేమానికి రూ.200 కోట్లు
- వికలాంగుల పథకానికి రూ.110 కోట్లు.
- వైద్య శాఖకు రూ.37,330 కోట్లు
- చిన్నారులకు రూ.76,200 కోట్లు
- వైద్య విద్యా శిక్షణ కోసం రూ.4727 కోట్లు
- ఆయూష్‌కు రూ.1069 కోట్లు
- విద్యాశాఖకు రూ.65,857 కోట్లు.
- సర్వశిక్ష అభియాన్‌కు రూ.27,368 కోట్లు.
- స్కాలర్‌షిప్‌లకు రూ.5,284 కోట్లు.
- మధ్యాహ్న బోజనం రూ.13,837 కోట్లు
- మహిళలు, శిశివు పోషకాహార పథకానికి రూ.300 కోట్లు, 100 నుంచి 200 జిల్లాలకు ఈ పథకం విస్తరణ
- గ్రామీణాభివృద్ధికి రూ.80,195 కోట్లు.
- ఇందిరా ఆవాస్ యోజన కోసం రూ.15,184 కోట్లు.
- తాగునీటి, పారిశుధ్యానికి రూ.15,260 కోట్లు.
- ఫ్లోరైడ్ ప్రాంతాల్లో తాగునీటి శుద్ధికి రూ.1400 కోట్లు
- గ్రామీణ సడక్ యోజన రెండో ధఫా ప్రారంభిస్తాం.
- 12వ ప్రణాళికలో నగరాభివృద్ధి పథకం కొనసాగింపు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 250 మినియన్ టన్నుల పైనే.
- రవాణా శాఖకు అదనంగా 10 వేల బస్సులు.
- రవాణా శాఖకు రూ.14,873 కోట్లు
- వ్యవసాయ మంత్రిత్వ శాఖకు రూ.27,049 కోట్లు.
- వాటర్ షెడ్ల నిర్వహణకు రూ.5,387 కోట్లు.
- ఎస్సీ,ఎస్టీ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.5,284 కోట్లు.
- మైనార్టీ సంక్షేమానికి రూ.3,511 కోట్లు.
- ఉపాధి పనులకు రూ.70 వేల కోట్లు.
- ఉపకార వేతనాలకు రూ.5,284 కోట్లు.
- రూ. 7లక్షల కోట్ల మేర పంట రుణాలు, సకాలంలో రుణాలు చెలించే రైతులకు రాయితీ.
- ఆహార భద్రత పథకానికి అదనంగా రూ.10 వేల కోట్లు.
- పంట మార్పిడికి ప్రోత్సాహం.
- మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడుల కోసం కొత్త పథకాలు.
- 2013-14 బడ్జెట్ రూ16,65,282 కోట్లు.
- ఈ ఏడాది ప్రణాళిక వ్యయం రూ.5,55,322 కోట్లు.
- ఆంధ్రప్రదేశ్, బెంగాల్‌లో మేజర్ ఓడరేవులు.
- ఎయిమ్స్ తరహా ఆరు వైద్య సంస్థలు.
- పంట శీతలీకరణ గోదాముల కోసం రూ.500 కోట్లు.
- తొలిసారి రూ.25 లక్షల గృహ రుణం తీసుకున్నవారికి లక్ష వడ్డీ తగ్గింపు.
- బొగ్గు ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యానికి ప్రాధాన్యం
- బొగ్గు దిగుమతులు తగ్గించడం ప్రాధాన్యం.
- చిన్న తరహా పరిశ్రమలకు మూడున్నరేల్ల పన్ను రాయితీ.
- చెన్నై - బెంగుళూరు మధ్య పారిశ్రామిక కారిడార్.
- త్వరలో రోడ్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు.
- మరమగ్గుల ఆధనికీకరణకు రూ.2400 కోట్లు.
- జౌళి పరిశ్రమలో కాలుష్య నియంత్రీకరణకు రూ.500 కోట్లు.
- 12వ ప్రణాళికలో ఖాది పరిశ్రమకు రూ.850 కోట్లు.
-  వ్యవసాయ పరిశోధనకు రూ.3145 కోట్లు.
- 13 జాతీయ బ్యాంకులకు రూ.12,570 కోట్ల అదనపు పెట్టుబడి. ప్రతి బ్యాంకుకు ఏటీఎమ్ తప్పనిసరి.
- ప్రభుత్వ రంగంలో మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు.
- మహిళా బ్యాంకుకు వెయ్యి కోట్లు మూలధనం. రుణ పరపతికి వీలుగా జాతీయ మహిళా బ్యాంకు.
- వాణిజ్య బ్యాంకుల ద్వారా వ్యక్తిగత భీమా పథకాలు.
- టెక్స్‌టైల్స్ పార్కులకు రూ.50 వేల కోట్లు.
- 10 వేల జనాభా దాటిన గ్రామంలో జాతీయ బ్యాంకు, ఎల్ఐసీ కార్యాలయాల ఏర్పాటు.
- త్వరలో సెబీ చట్ట సరవరణకు చర్యలు.
- అంగన్‌వాడీ వర్కర్లకు గ్రూప్ భీమా పథకాలు.
- పవన విద్యుత్‌కు రూ.800 కోట్లు.
- ఆరు శాతం వడ్డీతో చేనేత మహిళలకు రుణాలు.
- రక్షణ రంగానికి రూ.2,03,670 కోట్లు.
- సైన్స్ అండ్ టెక్నాలజీకి రూ.6 వేల కోట్లు.
- పాటియాలాలో జాతీయ క్రీడా శిక్షణ సంస్థ.
- లక్ష జనాభా దాటిన పట్టణాల్లో ఎఫ్ఎం రేడియోలు. ఈ ఆర్థిక ప్రణాళికలో 800 పైగా ఎఫ్ఎమ్ స్టేషన్లు.
- పోస్టాఫీస్ బ్యాంకింగ్ కోసం రూ.532 కోట్లు.
- మహిళా భద్రత సమిష్టి బాధ్యత. నిర్భయ ఫండ్ కోసం రూ.1000 కోట్లు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణ లోటు 5.2 శాతం.
- పన్నుల విధానంలో పారదర్శకత టాక్స్ అడ్మిస్టేషన్ రిఫార్మ్స్ కమిషన్ ఏర్పాటు.
- ఆదాయ పన్ను విధానం యథాతథం.
- ఏడాదికి రూ.2-5 లక్షలు లోపు ఆదాయం ఉన్న వారికి రెండు వేల పన్ను మినహాయింపు.
- ఏడాదికి కోటి ఆదాయంపైన ఉన్నవారికి 10 శాతం సర్‌చార్జి. మొత్తం 42,800 మందికి వర్తింపు.
- ఉద్యోగులకు పన్ను రాయితీ.
- రూ.50 లక్ష లు దాటిన స్థిరాస్తి విక్రయంపై ఒక శాతం పన్ను . వ్యవసాయ భూములకు మినహాయింపు.
- టీవీ సెట్అప్ బాక్స్ దిగుమతులపై 5 శాతం సుంకం.
- ఏసీ లగ్జరీ కార్లపై సుంకం పెంపు.
- సిగిరెట్లపై 18 శాతం పన్ను పెంపు.
- పెరుగనున్న విదేశీ కార్ల ధరలు.
- రెండు వేలు దాటిన సెల్‌ఫోన్‌పై 6 శాతం సుంకం పెంపు.
- ఏసీ ఉన్న అన్ని హోటళ్లకు సర్వీస్ ట్యాక్స్.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏ నిమిషంలో ఏ కేసు మీద పోలీసులు తన ఇంటి తలుపు తడతారో, ఏ నిమిషంలో ఇంటి మీదకి ఎవరు దాడి చేస్తారో అని భయంగా అనిపిస్తోందని చెప్పుకున్నాడట. ఈ టెన్షన్ తాను భరించలేకపోతున్నానని, చచ్చిపోతే ఏ గొడవా వుండదని అన్నాడట.
విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి సంచలన విజయం సాధించిన కేశినేని చిన్నిని కంఠంనేని అభినందించారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సురేఖ ఆయనకు అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు మొదటి లేఖ రాశారు. ఈ లేఖలో తన మనసులోని ఆలోచలను ప్రజలతో పంచుకున్నారు.
పుంగనూరులో పెద్దరెడ్డి సీన్ రివర్స్ అయ్యింది. ఇటీవలి ఎన్నికలలో పుంగనూరు నుంచి చావు తప్పి కన్నులొట్టబోయిన చంద్రంగా విజయం సాధించినా నియోజకవర్గంపై ఆయన పట్టు మాత్రం పూర్తిగా సడలిపోయింది. నియోజకవర్గంలోకి అడుగుకూడా పెట్టలేని దయనీయ స్థితిని ఆయన ఎదుర్కొంటున్నారు.
రాహుల్ గాంధీ చేసిన పనికి మనసులో కోపం పెట్టుకున్న వయనాడ్ ఓటర్లు ఈసారి ఉప ఎన్నికలో ప్రియాంకని ఓడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందించిన ఐప్యాక్ కు చెల్లింపులు ఎక్కడ నుంచి జరిగాయి అన్న విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐ ప్యాక్ కు చెల్లించిన ప్రతి పైసా కూడా ప్రభుత్వం నుంచే వెళ్లిందనీ, ఆ విధంగా జగన్ సర్కార్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందన్న విమర్శలు, ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
చరిత్ర కనీవినీ ఎరుగని ఓటమిని చవి చూసిన వైసీపీ ఇప్పుడు ముఖం కాపాడుకోవడానికి నానా తంటాలూ పడుతోంది. ఫలితాల వెల్లడి తరువాత కొన్ని రోజుల పాటు వైసీపీ కార్యాలయంలో శ్మసాన నిశ్శబ్దం తాండవించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం రెండున్నరేళ్లలో పూర్తి కానుంది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ స్వయంగా చెప్పారు. చంద్రబాబు హయాంలో అమరావతి దాదాపు పూర్తి కావచ్చిన తరుణంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన సంగతి తెలిసిందే.
పాపం ఈ జగన్ పిల్లోడు ఏ దుర్ముహూర్తంలో పదకొండు సీట్లకి ఫిక్సయ్యాడో గానీ, సోషల్ మీడియాలో 11 అనే పాయింట్ మీద ఎటకారాలే ఎటకారాలు.
చంద్రబాబు కేబినెట్ లో సీనియర్లకు స్థానం దక్కకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. కేబినెట్ కూర్పు పాత కొత్తల మేలు కలయికగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నప్పటికీ పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచి, జగన్ సర్కార్ వేధింపులను ఎదుర్కొని, కేసుల్లో ఇరుక్కుని పోరాడిన అయ్యన్నపాత్రుడు వంటి వారికి కూడా స్థానం లేకపోవడం ఏమిటన్న ఆశ్చర్యం మాత్రం పలువురిలో వ్యక్తం అయ్యింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.