తెలంగాణ గడ్డపై బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సు జరుగుతున్న వేళ టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బడంగ్ పేట్ మేయర్ పార్టీకి రాజీనామా చేశారు. నిన్న కాక మొన్న బీజేపీ కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి తెరాస గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి బడంగ్ పేట మేయర్ రాజీనామా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.
బడంగ్ పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి తన రాజీనామా లేఖను పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పంపారు. బడంగ్ పేట్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరి పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమం విజయవంతం చేశానని ఆ లేఖలో పారిజాత నరసింహారెడ్డి పేర్కొన్నారు. కాగా తన రాజీనామా విషయాన్ని ఓ ప్రకటన ద్వారా మీడియాకు తెలిపిన పారిజాత నర్సింహారెడ్డి పార్టీకి అంకిత భావంతో సేవలందించినా, ఇటీవలి కాలంలో పార్టీలో గుర్తింపు కరవైందనీ, అవమానాలు ఎదురౌతున్నాయనీ పేర్కొన్నారు.
ఆత్మ గౌరవాన్ని చంపుకుని పార్టీలో కొనసాగడం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తాను కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఒక తెలంగాణ బిడ్డగా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని ఆమె అన్నారు. పార్టీలో సహకరించిన పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాయకులందరితో కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తామని ఆమె అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/budengpet--25-138988.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.