లోక్ సభ ఎన్నికల ముందు అజెండా లేక బీఆర్ఎస్ డీలా!

Publish Date:Feb 28, 2024

Advertisement

భారత రాష్ట్ర సమితిని  తెలంగాణ ప్రజలు పూర్తిగా విస్మరించారా? ఎప్పుడైతే పార్టీ పేరులోంచి తెలంగాణను తొలగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచే కేసీఆర్ ప్రభుత్వాన్ని వదిలించేసుకోవాలని తెలంగాణ జనం డిసైడైపోయారా అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. 

అదలా ఉంటే.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై  కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన క్షణం నుంచీ బీఆర్ఎస్ కు వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలూ పెరిగాయి. వలసల జోరు చూస్తుంటే.. బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. పార్టీ మారుతున్న వారిపై విమర్శలు చేయడానికి కూడా ఆ పార్టీ అధినేతకు అవకాశం లేని పరిస్థితి కనిపిస్తోంది. ఆయన పార్టీ మారుతున్న వారిపై ఏమైనా విమర్శలు చేస్తే.. తాను అధకారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి తలుపులు బార్లా తెరిచి మరీ స్వాగతం పలకడమే కాకుండా, వారికి పదవులు కట్టబెట్టిన సంగతి గుర్తు చేసి నిలదీస్తారన్న భయం ఆయనను మౌనం వహించేలా చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన పరాభవాన్ని పక్కన పెట్టి కనీసం లోక్ సభ ఎన్నికలలోనైనా పుంజుకునేలా పార్టీనీ, క్యాడర్ ను సమాయత్తం చేద్దామంటే అందుకూ పరిస్థితులు సానుకూలంగా కనిపించడం లేదు. రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ నియోజకవర్గాలకూ అభ్యర్థులను ఎంపిక చేయడమే కష్టంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ దశలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని కనుసైగతో కంట్రోల్ చేసిన, ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా వ్యూహరచనలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఇంత డీలా పడిపోయారేమిటి? అని పరిశీలకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

కేసీఆర్ పరిస్థితి ఇలా ఉంటే మరో వైపు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తనకు మాత్రమే ప్రత్యేకమైన దూకుడుతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా చేసిన పొరపాట్లు, తప్పిదాలను కడిగి పారేస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పుకోలేని విధంగా ఆధారాలతో సహా చెరిగిపారేస్తున్నారు. ఈ తరుణంలో  లోక్ సభ ఎన్నికలలో కనీసం కొన్ని స్థానాలలోనైనా విజయం సాధించి ఆబోరు కాపాడుకోవాలని కేసీఆర్ తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఏదో విధంగా లోక్ సభ ఎన్నికలలో పుంజుకోవాలని చూస్తున్న ఆయన బీజేపీతో పొత్తుపై పార్టీ పరంగా లీకులు ఇచ్చారు. అయితే కేసీఆర్ ఈ ఎత్తుగడ కూడా ఘోరంగా విఫలమైంది. బీజేపీతో పొత్తు వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత బండి సంజయ్ ఘాటుగా బదులిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు అని ఎవరైనా అంటే చెప్పు తీసుకు కొట్టండి అంటూ ఆయన బహిరంగంగా ప్రకటించారు. దీనికి బీఆర్ఎస్ నుంచి గట్టిగా బదులిచ్చే నేతే లేకపోయారు. దీంతో బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ మాత్రమే తహతహలాడుతోందని అందరికీ తెలిసిపోయింది.

ఈ తరుణంలో  రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా   లోక్ సభ ఎన్నికలలో కనీసం ఒక్క స్థానంలోనైనా విజయం సాధించి చూపండి అంటూ సవాల్ విసిరారు.  అయినా కూడా కేసీఆర్ నుంచి కానీ, బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావుల నుంచి స్పందన లేదు.  దీంతో పార్టీ క్యాడర్ లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మరో వైపు ఎన్నికల ముందు రేవంత్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలనూ ఒకదాని వెంట ఒకటి గా అమలు చేస్తూ తనది మాటల సర్కార్ కాదు, చేతల ప్రభుత్వమని చాటుతున్నారు. తద్వారా లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ కు పూర్తి సానుకూల వాతావరణం ఏర్పడేలా చేసుకున్నారు. అదే సమయంలో  బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకూ అగమ్య గోచరంగా మారిపోతోంది. లోక్ సభ ఎన్నికలలో పోటీకి అభ్యర్థులనే ఎంపిక చేసుకోలేని దయనీయ స్థితికి ఆ పార్టీ దిగజారిపోయింది. అలాగే ఎన్నికల అజెండా కూడా ఇప్పటికీ ఖరారు చేసుకోలేని పరిస్థితిలో ఉంది.  మేడిగడ్డ కుంగుబాటు, కాళేశ్వరం వైఫల్యాలు ఆ పార్టీని వదలకుండా వెంటాడుతున్నాయి.  మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఎంతగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు ఆహ్వానించినప్పుడు నిరాకరించిన బీఆర్ఎస్.. ఇప్పుడు అదే మేడిగడ్డ సందర్శనకు ముహూర్తం ఖరారు చేసింది.  తన వైఫల్యాన్ని జనంలో మరోసారి భూతద్దంలో చూపే ప్రయత్నంగా బీఆర్ఎస్ మేడిగడ్డ సందర్శన కార్యక్రమాన్ని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. 

సరిగ్గా ఎన్నికల ముందు.. ఏం చెప్పి ప్రజలను ఓట్లడగాలన్న విషయంలో స్పష్టత లేని అయోమయ స్థితిలో బీఆర్ఎస్ ఉంటే.. అధికార కాంగ్రెస్ కొలువుదీరిన ఈ మూడు నెలలలో అమలు చేసిన వాగ్దానాలను విస్తృతంగా ప్రచారం చేసుకోవడంతో పాటు, అధికారంలో ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. ఇక బీజేపీకి అయితే రామమందిరం ప్రధాన ప్రచారాస్త్రంగా ఉంది. ఏ అజెండా లేకుండా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే.  పార్టీ ఈ పరిస్థితిలో ఉన్నా కేసీఆర్ మౌనం వీడకపోవడంతో ఆయన నాయకత్వంపై పార్టీ నేతలే కాదు, క్యాడర్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.