Publish Date:Jan 20, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేతల్లో ఒకరైన హరీష్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆయనకిలా సిట్ నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి. అయితే ఈ నోటీసులు జారీ కావడానికి ముందు సిద్దిపేట పర్యటనలో ఉన్న హరీష్ రావు మంత్రుల్లో వాటాల కొట్లాట జరుగుతోందనీ, మంత్రి సురేఖ పీఏ వ్యవహారం నుంచి మొదలు పెడితే తాజాగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి సినిమా టికెట్ ధరల పెంపు దలలో వాటాల అంశం వరకూ వాటాల కోసం గొడవ పడుతున్నారంటూ ఓ జాబితా ఏకరవు పెట్టారు హరీష్. అంతే కాదు.. మీరు ప్రతిదానిపైనా సిట్ వేస్తుంటారు కదా... సింగరేణి బొగ్గు కాంట్రాక్టు పనుల్లో జరిగే అవినీతిపై కూడా సిట్ వేయాలని సవాల్ చేస్తూ..సిట్ కాదు సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే ఇటీవల బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ ఎంక్వయిరీ కాదు.. ఈ రాష్ట్రానికి అత్యవసరంగా కావల్సింది న్యూస్ ట్యాపింగ్ మీద ఎంక్వయిరీ అంటూ ట్వీట్ చేశారు. ఆ తరువాత హరీష్ కి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సిట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఒక వార్ నడుస్తోంది. తమకున్న మీడియా పలుకుబడి ద్వారా... న్యూస్ ట్యాపింగ్ జరుగుతోందంటూ ఓ ప్రచారాన్ని మొదలెట్టింది కారు పార్టీ. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎక్కువగా ఇరుక్కోకుండా ఈ పథక రచన చేసినట్టు కనిపిస్తోంది.
ఇదే అంశంలో ఇక్కడి నుంచి జగన్ మద్దతు కూడా కారు పార్టీకి ఉన్నట్లు సమాచారం. దీంతో కారు- ఫ్యాను పార్టీలు రెండూ కలసి తెలంగాణలో ఒక అలజడి సృష్టించేందుకే.. వెంకటరెడ్డి- మహిళా ఐఏఎస్ వ్యవహారం తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది. దెబ్బకు దెబ్బ తీసేలా ఈ తేనెతుట్టె కదిపినట్టు సమాచారం. ఇందుకు సర్కార్ కూడా అటు వైపు నుంచి నరుక్కొస్తోంది. తమకున్న మీడియా బలం ద్వారా.. దీన్ని తిప్పి కొట్టే యత్నం చేస్తోంది. దీంతో ఇద్దరు మీడియా అధినేతలు చెరో వైపూ చీలి.. కొట్లాడుతున్న దృశ్యం తెలంగాణలో తొలిసారి కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-versus-congress-25-212774.html
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.