బేసిగ్గా కేసీఆర్ ఐడియాలు మీరది చేస్తే.. మేమిది చేస్తాం అన్నట్టుగా ఉంటాయి. ఆయన పొలిటికల్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది. ఉదాహరణకు మీరు మా కవితను లిక్కర్ కేసులో అరెస్టు చేస్తే.. మేం ఏకంగా తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్తా భారత రాష్ట్ర సమితిగా మార్చి.. దాన్ని ఢిల్లీ స్థాయిలో విస్తరింప చేసి.. ఆపై మీ కంట్లో నలుసుగా మారుతాం. బీజేపీ చేసే దానికి బీఆర్ఎస్ చేసేదానికి - బీఆర్ఎస్ చెల్లుకు చెల్లు అన్నట్టుగా గతంలో ఆయన వ్యవహరించిన తీరు చెప్పుకోవచ్చు.
ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత ఆయనతో పాటు కేటీఆర్, హరీష్, కవిత తదితరులు ఏదో ఒక కేసులో చిక్కి నానా కష్టాలు పడుతున్నారు. ఈ సమయంలో వారికి కాంగ్రెస్ ని కలవర పెట్టడానికి కలసి వచ్చిన ఏకైక అస్త్రం పార్టీ ఫిరాయింపులు.
నిజానికి ఈ పార్టీ ఫిరాయింపులు ఇప్పటికన్నా బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువగా జరిగాయి. అయితే అక్కడ చేసింది ఇక్కడ చేయలేనిదీ ఒకటే. అక్కడ ఏకంగా పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు ఇటు కలసి పోవడం వల్ల పార్టీయే మెర్జ్ అయిన పరిస్థితి కనిపించింది. అదే ఇప్పడు గెలిచిన వాళ్లలో కేవలం పది మందే వెళ్లి కలిసారు. వీరు కాంగ్రెస్ కి అదనం అవుతారు తప్పించి.. వీరు లేకపోతే వారికి వచ్చే నష్టమంటూ ఏదీ లేదు.
ఒక వేళ ఉప ఎన్నికలు వచ్చినా సగానికి సగం మంది గెలిచే ఛాన్సుంది కాబట్టి కాంగ్రెస్ బేఫికర్. ఇక్కడ మరో లింకు ఏంటంటే స్పీకర్ కి అధికారం ఇవ్వడం. దీంతో స్పీకర్ వర్సెస్ న్యాయమూర్తి అనే సమస్య తలెత్తుతుంది. ఇప్పటి వరకూ ఈ చట్టానికి న్యాయానికి మధ్య జరిగిన సమరంలో అన్ని వేళలా స్పీకరే గెలిచారు. స్పీకర్ ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడిన న్యాయమూర్తి. అదే కోర్టు న్యాయమూర్తిది పరోక్ష ఎంపిక. దీంతో ఈ విషయంలోనూ బీఆర్ఎస్ పప్పులు ఉడికేలా లేవు.
గతంలో సుప్రీంకోర్టుకెక్కిన రోజా.. అసెంబ్లీకి తనను రానివ్వాలంటూ తీర్పు తెచ్చుకున్నారు. కానీ ఆనాటి స్పీకర్ కోడెల ఆ జడ్జికంటే మోస్ట్ పవర్ఫుల్ ఈ జడ్జి.. అంటే స్పీకర్ అంటూ ఆ తీర్పును అమలు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అనుకున్న విధంగా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
సో బీఆర్ఎస్ పెట్టిన చెక్ నుంచి తప్పించుకోడానికి కాంగ్రెస్ ముందు చాలానే దారులున్నట్టుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గేమ్ లో.. తర్వాతి స్టెప్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-trying-to-link-kaleswaram-to-partydefectin-act-25-203252.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.