కాళేశ్వరానికి.. ఫిరాయింపు నిరోధక చట్టానికి లింకు వేస్తున్నారా? సార్
Publish Date:Aug 1, 2025
Advertisement
బేసిగ్గా కేసీఆర్ ఐడియాలు మీరది చేస్తే.. మేమిది చేస్తాం అన్నట్టుగా ఉంటాయి. ఆయన పొలిటికల్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది. ఉదాహరణకు మీరు మా కవితను లిక్కర్ కేసులో అరెస్టు చేస్తే.. మేం ఏకంగా తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్తా భారత రాష్ట్ర సమితిగా మార్చి.. దాన్ని ఢిల్లీ స్థాయిలో విస్తరింప చేసి.. ఆపై మీ కంట్లో నలుసుగా మారుతాం. బీజేపీ చేసే దానికి బీఆర్ఎస్ చేసేదానికి - బీఆర్ఎస్ చెల్లుకు చెల్లు అన్నట్టుగా గతంలో ఆయన వ్యవహరించిన తీరు చెప్పుకోవచ్చు. నిజానికి ఈ పార్టీ ఫిరాయింపులు ఇప్పటికన్నా బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువగా జరిగాయి. అయితే అక్కడ చేసింది ఇక్కడ చేయలేనిదీ ఒకటే. అక్కడ ఏకంగా పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు ఇటు కలసి పోవడం వల్ల పార్టీయే మెర్జ్ అయిన పరిస్థితి కనిపించింది. అదే ఇప్పడు గెలిచిన వాళ్లలో కేవలం పది మందే వెళ్లి కలిసారు. వీరు కాంగ్రెస్ కి అదనం అవుతారు తప్పించి.. వీరు లేకపోతే వారికి వచ్చే నష్టమంటూ ఏదీ లేదు. ఒక వేళ ఉప ఎన్నికలు వచ్చినా సగానికి సగం మంది గెలిచే ఛాన్సుంది కాబట్టి కాంగ్రెస్ బేఫికర్. ఇక్కడ మరో లింకు ఏంటంటే స్పీకర్ కి అధికారం ఇవ్వడం. దీంతో స్పీకర్ వర్సెస్ న్యాయమూర్తి అనే సమస్య తలెత్తుతుంది. ఇప్పటి వరకూ ఈ చట్టానికి న్యాయానికి మధ్య జరిగిన సమరంలో అన్ని వేళలా స్పీకరే గెలిచారు. స్పీకర్ ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడిన న్యాయమూర్తి. అదే కోర్టు న్యాయమూర్తిది పరోక్ష ఎంపిక. దీంతో ఈ విషయంలోనూ బీఆర్ఎస్ పప్పులు ఉడికేలా లేవు. గతంలో సుప్రీంకోర్టుకెక్కిన రోజా.. అసెంబ్లీకి తనను రానివ్వాలంటూ తీర్పు తెచ్చుకున్నారు. కానీ ఆనాటి స్పీకర్ కోడెల ఆ జడ్జికంటే మోస్ట్ పవర్ఫుల్ ఈ జడ్జి.. అంటే స్పీకర్ అంటూ ఆ తీర్పును అమలు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అనుకున్న విధంగా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. సో బీఆర్ఎస్ పెట్టిన చెక్ నుంచి తప్పించుకోడానికి కాంగ్రెస్ ముందు చాలానే దారులున్నట్టుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గేమ్ లో.. తర్వాతి స్టెప్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.
ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత ఆయనతో పాటు కేటీఆర్, హరీష్, కవిత తదితరులు ఏదో ఒక కేసులో చిక్కి నానా కష్టాలు పడుతున్నారు. ఈ సమయంలో వారికి కాంగ్రెస్ ని కలవర పెట్టడానికి కలసి వచ్చిన ఏకైక అస్త్రం పార్టీ ఫిరాయింపులు.
http://www.teluguone.com/news/content/brs-trying-to-link-kaleswaram-to-partydefectin-act-39-203251.html





