ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఓటింగ్ కు బీఆర్ఎస్ దూరం?

Publish Date:Sep 8, 2025

Advertisement

తెలంగాణ రాజకీయ యవనిక నుంచి బీఆర్ఎస్ క్రమంగా కనుమరుగౌతోందా? రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో ఆ పార్టీ తడబాటే అందుకు నిదర్శనమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. మాటల మాంత్రికుడిగా, అపర చాణక్యుడిగా పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారం చలాయించి తిరుగులేని నేతగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్క ఓటమి.. అధికారం దూరం కావడంతో రాజకీయంగా క్రియాశీల పాత్రపోషించడానికి ముందు వెనుకలాడుతున్నారు. పొలిటికల్ డెసిషన్స్ తీసుకునే విషయంలో తడబాటుకు గురౌతున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమై.. ఎంపిక చేసుకున్న నాయకులతో మంతనాలకే పరిమితమౌతున్నారు. ఈ  పరిస్థితుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కవిత ఎపిసోడ్ లో కూడా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వినా మరేం చేయలేక మౌనం వహించడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. 

ఇక  మంగళవారం (సెప్టెంబర్ 9)న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా ఎటువైపు అన్న నిర్ణయం తీసుకోలేక మొత్తంగా  ఓటింగ్ కు దూరం కావాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు  ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఓటింగ్ కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.  ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటింగ్ కు దూరంగా ఉండాలన్న సూత్రప్రాయ నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చినట్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మరి కొద్ది మంది నాయకులతో మంతనాలు జరిపిన కేసీఆర్.. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ కు పార్టీ సభ్యులు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.  

తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుత పరిస్థితుల్లో  ఇటు ఎన్డీయేకు లేదా అటు ఇండియా కూటమికి ఎవరికి మద్దతు ఇచ్చినా రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తప్పవని  భావించిన బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఓటింగ్ కు దూరంగా ఉండడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.   అదే ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో తబడాటుకు గురౌతోందన్న పరిశీలకులు విశ్లేషణలకు కారణమైంది. 

By
en-us Political News

  
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.