Publish Date:May 23, 2023
డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బిఆర్ఎస్ సంసిద్దమైంది. అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. తెలంగాణలోని 119 స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సిద్దంగా ఉండాలని బిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు.
కర్ణాటక ఫలితాల తర్వాత బిఆర్ఎస్ స్ట్రాటజీ మారింది. ఈ ఎన్నికలకు ముందు భారతీయ జనతాపార్టీతో పూర్తి వైరంతో ఉన్న కెసీఆర్ ఫలితాల తర్వాత చడీ చప్పుడు లేకుండా ఉన్నారు. ప్రతీరోజు మోడీపై వివర్శనా స్త్రాలు సంధించే బిఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ మీద అస్ట్రాలను ఎక్కుపెట్టింది. కర్ణాటక ఫలితాల్లో కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో గెలుపొందడమే దీనికి కారణం. కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో కాంగ్రెస్ లోకి వలసలు పెరిగిపోవడంతో కేసీఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ జిల్లాల్లో బిఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాలతో పాటు డెవలప్ మెంట్ కార్యక్రమాలను ప్రచారం చేసే పనిలో కేసీఆర్ ఉన్నారు. బిజెపికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పార్టీలను ఏకం చేసే కార్యక్రమాలను కేసీఆర్ ప్రస్తుతానికి నిలుపుదల చేశారు.
పచ్చగడ్డివేస్తే భగ్గుమనే స్థాయిలో బిజెపి, బిఆర్ఎస్ వైరం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అవసరమైతే పొత్తుల అంశం పరిశీలిస్తున్నట్లు కెసిఆర్ చెప్పారు. ప్రస్తుతం మిత్ర పార్టీల్లో మజ్లిస్ పార్టీ మద్దత్తు బిఆర్ఎస్ కు ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు క్లారిటీ ఉంది కానీ కేసీఆర్ కి క్లారిటీ లేదు. . ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తులు పెట్టుకోవాలని కెసీఆర్ యోచిస్తున్నారని వినికిడి.
2014,2019లో కెసీఆర్ ఒంటరిగానే పోటీ చేశారు. రెండు పర్యాయాలు అధికారంలో వచ్చారు. వరుసగా మూడోసారి అధికారంలో రావాలని చూస్తున్నారు. హ్యాట్రిక్ కొట్టాలని కెసీఆర్ ఎత్తుగడ.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలతో అవగాహన కుదుర్చుకుని పోటీ చేసి గెలుపొందింది. ప్రస్తుతం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సంయుక్తంగా పోటీ చేయాలని సిగ్నల్స్ అందుతున్నాయి. ఎందుకంటే పొత్తులు, సీట్ల సర్దుబాట్ల విషయంలో ఎలాంటి చొరవ చూపించని కెసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మిత్ర పార్టీలు శత్రు పార్టీలుగా మారకపోవచ్చని కెసీఆర్ నమ్మకం. ఎందుకంటే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు బిజెపి ప్రధాన శత్రువు. బీఆర్ఎస్ ను పల్లెత్తు మాట అనని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు లోపాయికారి పొత్తు పెట్టుకున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కర్ణాటక ఫలితాల తర్వాత కెసిఆర్ వామపక్షాలతో మిత్రత్వం గూర్చి ఎటువంటి ప్రకటన చేయకపోవడం శోచనీయమని ఉభయ కమ్యూనినిస్ట్ పార్టీల నేతలు కూనంనేని సాంబశివరావ్, తమ్మినేని వీరభధ్రం బహిరంగంగానే కెసీఆర్ ను విమర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మా పార్టీలు బలంగా ఉన్నాయి. ఎక్కువ స్థానాలు గెలుపొందుతాం. ఫలితాల తర్వాత హంగ్ వచ్చే అవకాశం ఉంది. హంగ్ వస్తే కెసిఆర్ మమ్మల్ని సంప్రదించొచ్చు అని ఈ నేతలు అనుమానం వ్యక్తం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-stratezy-changed-39-155780.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.