అట్లుంటది రేవంత్‌రెడ్డితోని!!

Publish Date:May 17, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం రాబోతోంది. కవిత జైలు నుంచి విడుదల అవ్వకపోయినా పర్లేదుగానీ, ఏపీలో చంద్రబాబు మాత్రం అధికారంలోకి రాకూడదని తెలంగాణలో కేసీఆర్ అండ్ కంపెనీ ముక్కోటి దేవతలకు మొక్కుకున్నారు. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిసిపోవడంతో, ఈ బ్యాచ్ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఏపీలో  చంద్రబాబు అధికారంలోకి రాగానే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుకు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. చంద్రబాబు గురువు, రేవంత్ రెడ్డి శిష్యుడు కాబట్టి, గురువుకు అనుకూలంగా శిష్యుడు వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ ప్రయోజనాలు పణంగా పెడుతున్నాడని అరచి గోలచేసి, తెలంగాణ సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి, ఆంధ్రులపై వ్యతిరేకతను తిరగదోడి ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది. 

ఈ వ్యూహాలకు ప్రతి వ్యూహాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెడీ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడంటే తనకు ఎంతో గౌరవం వుందే తప్ప, రాజకీయంగా ఆయనకీ తనకి ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని ఆయన సందర్భం దొరికినప్పుడల్లా చెబుతున్నారు. ఈ మధ్య రేవంత్ మీడియా వాళ్ళని కలసినప్పుడు ఓ నోటి తుత్తరగాడు ఇలా అడిగాడు.. తెలంగాణలో పోటీ పెట్టకుండా గురువు సహకరించారు.. ఇప్పుడు అక్కడ గురువు పోటీ చేస్తున్నారు. శిష్యుడు సహకరిస్తారా? అని అడిగాడు. దాంతో రేవంత్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలం లాగా సీరియస్సయిపోయి వార్నింగ్ ఇస్తూ, ‘‘ఎవడయ్యా బుర్రలేనోడు మాట్లాడేవాడు.. శిష్యుడెవరు, గురువెవరు? నేను సహచరుడిని అని చెప్తున్నాను. ఎవడైనా బుద్ధిలేని గాడిద కొడుకు శిష్యుడు, గురువు అని మాట్లాడితే బుడ్డిమీద పెట్టి తంతా. చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. ఆయన సహచరుడిని నేను. నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళాను. నేను ఆయనకు సహచరుణ్ణి.  వారంటే అపారమైన గౌరవం వుంది ఇప్పటికి కూడా చెప్తున్నా.. అంతే తప్ప గురువు, శిష్యుడు అంటే ఊరుకునేది లేదు. నేను తెలంగాణ వాణ్ణి, కాంగ్రెస్ పార్టీ వాడిని. తెలంగాణ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం మాత్రమే పనిచేస్తాను’’ అని స్పష్టంగా చెప్పారు.

జూన్ 2 తర్వాత హైదరాబాద్ ఏపీకి, తెలంగాణకి ఉమ్మడి రాజధాని కాదు కాబట్టి, ప్రస్తుతం హైదరాబాద్‌లో, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో వున్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. అలాగే విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య కుదరాల్సిన పంపకాల విషయంలో రాజీలేకుండా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు మీద గౌరవం గౌరవమే, తెలంగాణ ప్రయోజనాలు ప్రయోజనాలే అన్నట్టుగా వ్యవహరించి, కేసీఆర్ అండ్ కంపెనీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయకుండా కంట్రోల్ చేయాలన్న వ్యూహంలో రేవంత్ వున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల ఫలితాలు సరిగ్గా మూడు రోజుల్లో వెలువడతాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి ఎన్నికలు హోరాహోరీగా సాగాయని చెబుతున్నారు. అయితే సర్వేలు, అంచనాలూ తెలుగుదేశం కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఖాయమని చెబుతున్నాయి. పోలింగ్ తరువాత నుంచీ వైసీపీ నేతల భాష, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే వారికి కూడా రాబోయేది ఓటమే అది కూడా అలాంటి ఇలాంటి ఓటమి కాదు ఘోర పరాజయం అన్న సంగతి తెలిసిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇక మరి కొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిరంతరం ప్రజల మధ్య ఉంటారు. ప్రజా శ్రేయస్సు కోసం అనుక్షణం తపిస్తుంటారు. ఆయన అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఈ విషయంలో ఆయన తీరు ఇసుమంతైనా మారదు. విజయవాడలో డయోరియా మరణాలు రోజు రోజుకూ పెరుగుతూ ఉంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కానీ, అధికార పార్టీ నేతలు కానీ కనీసం అక్కడి పరిస్థితులపై సమీక్షించలేదు.
ఓటమి అంచున నిలబడి వైసీపీ నేతలు కొందరు బెదరింపులకు దిగుతున్నారు. హెచ్చరికలు చేస్తున్నారు. ఇంత కాలం తమ వద్ద కుక్కిన పెనుల్లా పడి ఉన్న అధికారులే తమపై కేసులు నమోదు చేస్తుంటే.. ఏమిటీ ధిక్కారం అంటూ పెచ్చులకు పోతున్నారు. రేపు మీ సంగతేమిటో చూస్తాం అంటూ రంకెలు వేస్తున్నారు. ఇంత అన్యాయమా అంటూ పెడబొబ్బలు పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ హయాంలో అలుపెరుగని పోరాటం ద్వారా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు రాజకీయ నాయకుడు అయితే మరొకరు ఐపీఎస్ అధికారి. ఇద్దరినీ కూడా కేవలం వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని జగన్ వేధింపులకు గురి చేశారు. వారి స్థాయి, హోదాకు ఇసుమంతైనా విలువ ఇవ్వకుండా నానా రకాలుగా వేధించారు.
వైసీపీ రౌడీ, గూండా బిడ్డల్లారా.. పోలింగ్ రోజున ఓవర్ యాక్షన్ చేయకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళు పడి వుండండి.. బయటకొచ్చి ఏదైనా అతి చేశారో... పోలీసులని చూశారుగా.. తుక్కుతుక్కు అయిపోతారు జాగ్రత్త!
తాము చేసిన దాడులు తమ మీద కూడా రిపీట్ అవుతాయన్న భయంతో వైసీపీ క్యాడర్ వణికి చస్తోంది. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చే జూన్ నాలుగో తేదీన తమ ఇళ్ళలో, తమ ఊళ్ళో లేకుండా వేరే ఎక్కడైనా తలదాచుకునే ప్రయత్నాల్లో వున్నారు.
గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా తగ్గాయి. అయితే ఈ తగ్గిన ధరలు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గడంతో అందుకు అనుగుణంగా దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి.
ఏపీలో ఎన్నికలు పూర్తయిపోయిన తరువాత తెలుగుదేశం ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించింది. తెలంగాణలో పార్టీ కేడర్ గత పదేళ్లుగా చెక్కుచెదరకుండా నిలబడినప్పటికీ, అనివార్యంగా తెలుగుదేశం ఆ రాష్ట్రంలో ఎన్నికల పోటీకి దూరంగా ఉంది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కానీ, ఇప్పుడు జరిగిన లోక్ సభ ఎన్నికలలో కానీ తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది.
సాధారణ ఎన్నికలు ముగింపునకు వచ్చేశాయి. శనివారం ( జూన్ 1) తుది విడత పోలింగ్ జరుగుతోంది. అంచనాలన్నీ బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేవన్నట్లుగానే ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్, ఇండియా కూటమి గట్టిగా పుంజుకున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. అటువంటి తరుణంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు శనివారం (జూన్ 1) పసాయంత్రం 3 గంటలకు సమావేశమౌతున్నాయి.
లండన్ వెళ్ళడానికి విమానం ఎక్కే సమయంలో కళ తప్పి, కాంతివిహీనం అయిపోయి వున్న ఆయన ముఖం ఇప్పుడు రంగు తేలింది. మిలమిలలాడుతోంది. ముఖ్యంగా బుగ్గలయితే బూరెల్లాగా పొంగాయి.
దేశంలో చివరి దైన ఏడో దశ పోలింగ్ శనివారం (జూన్1) ప్రశాంతంగా సాగుతోంది. ఈ చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 57 లోక్ సభ స్థానాలతో పాటు, ఒడిశా అసెంబ్లీలోని 42 స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-3
అసలు ‘మెడిటేషన్’ అనే మాటని క్యాన్సిల్ చేసేసి ‘మోడిటేషన్’ అని మారిస్తే మంచిది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.